PANCHAYUDHAMURTHY SHINES BRIGHT ON SURYAPRABHA VAHANA SEVA_ సూర్యనారాయణుడి రూపంలో శ్రీమన్నారాయణుడు

Tirumala, 29 September, 2017: Wearing five varieties of weapons, Lord Malayappa Swamy as Panchayudhamurthy blessed devotees in four mada streets of Tirumala on the seventh day morning on Friday on the bright and shining Suryaprabha Vahanam.

SIGNIFICANCE:

In our Vedic Sampradayam, Arunam means the most powerful mantras of the Vedas about Surya Bhagwan. Arunam primarily describes the various forms of Surya Bhagwan and many ways he blesses his devotees.

Arunam is selection of mantras from Krishna Yajur Vedam. The mantras of Arunam, Souram and Tricha show Surya as Chief God. However it is the lord Srimannarayana who is the inner soul Supreme Being, who is the master of all deities. Hence Lord Surya is referred to as Srimannarayana.

PANCHAYUDHAMURTHY:

Sri Vishnu Panchayudha Sthothram is a set of glorious verses praising the five fierce weapons of Lord Vishnu, such as Wheel/Sudharshana Chakra, Conch/Panchajanya, Mace/Kaumodhaki, Sword/Nandakam and Bow/ Sharngam. Whoever recites the holy verses praising the Panchayudham of Lord Vishnu would be relieved from all fears, sins, grief and sorrows.

Lord Malayappa Swamy as Panchayudhamurthy shined brightly on the glittering Suryaprabha Vahanam wearing a huge garland made of Red Ixora and blessed the devotees.

TTD EO Sri Anil Kumar Singhal, JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, CVSO Sri Ake Ravikrishna, Temple DyEO Sri Rama Rao and others took part.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

సూర్యనారాయణుడి రూపంలో శ్రీమన్నారాయణుడు

తిరుమల, 2017 సెప్టెంబరు 29: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన శుక్రవారం ఉదయం శేషాచలాధీశుడు సూర్యప్రభ వాహనంపై శ్రీ సూర్యనారాయణుడి అవతారంలో తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

ఈ సందర్భంగా శ్రీ మన్నారాయణుడు సుదర్శనచక్రం, గద, ఖడ్గం, విల్లు, ఈటె, శంఖం వంటి పంచ ఆయుధాలను దరించి ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

బ్రహ్మోత్సవాలలో ఏడవరోజు ఉదయం శ్రీహరు సూర్యప్రభవాహనం అధిష్ఠించి తేజో విరాజితుడై కనిపిస్తాడు. సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత, వర్షాలు- వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతనివల్ల పెరిగే ఓషదులు మొదలైనవన్నీ సూర్య తేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్ఠించి స్వామి కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధమైన తిరుమలలో ఊరేగడం ఆనందదాయకం.

శ్రీమన్నారాయణుడు సూర్యమండల మధ్యవర్తి అని – ”ధ్యేయ స్సదా సనితృమండలమధ్యవర్తీ నారాయణః” వంటి ప్రమాణాలచే తెలుస్తున్నది. అందుకే ప్రతిరోజూ ఉదయం భారతీయులకు సూర్యోపాసన చేసే సంస్కృతి అలవడింది. గాయత్రీ మంత్రంతో దేదీప్యమానుడైన సూర్యభగవానుని శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన తేజస్సుసు ఆరాధిస్తాము. ఆ తేజం మన బుద్ధులకు ప్రేరణనిస్తుంది.

సూర్యుడు సప్తరశ్మి. స్వామి సప్తశైలవాసి. సూర్యుడు సప్తాశ్వరథారూఢుడై నిత్యం విహరిస్తూ తన తేజస్సుతో లోకానికి చైతన్యం కలిగిస్తున్నాడు. సూర్యుడు కర్మసాక్షి. ప్రత్యక్షదైవం, ఆ సూర్యునిప్రభ వెలుగులీనుతూ వేంకటేశ్వరుని ముందుకు నడపటం ముదావహం. ”ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌” అని ప్రసిద్ధి. మయూరాదులు, సాంబుడు వంటి భక్తులకు సూర్యోపాసనచేత ఆరోగ్యవంతులై, కృతకృత్యులైనట్లు ప్రాచీన సారస్వతం నుండి తెలుస్తున్నది.

ఆరోగ్యమే కాక కవిత్వం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహంవల్ల సిద్ధిస్తున్నాయని సూర్యశతకం తెలియజేస్తున్నది. సూర్యోపాసన చక్షూ రోగనివృత్తి నిచ్చేదిగా యజుర్వేదంలోని చాక్షుషోపనిషత్తు ప్రబోధిస్తున్నది.

సూర్యప్రభపైన శ్రీనివాసుని దర్శనం తిరుమల యాత్రికులకు పూర్ణఫలాన్ని ప్రసాదిస్తున్నది. ఆరోగ్యం, ఐశ్వర్యం పరిపూర్ణంగా ఈ వాహనసేవ వల్ల భక్తకోటికి సిద్ధిస్తున్నాయి.

అనంతరం సాయంత్రం 7.00 నుండి 8.00 గంటల వరకు ఊంజల్‌ సేవ వైభవంగా జరగనుంది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావు, జెఈవో శ్రీకె.యస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.