PANGUNOTTARA UTSAVAM CONCLUDES IN SRI GT_ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన పంగుణోత్తర ఉత్సవం

Tirumala, 30 March 2018: The traditional Pangunottara Utsavam at the Sri Pudarikavalli (Salai Nambiar) sub temple at the Sri Govindaraja swamy temple concluded on a grand note on Friday.

As part of the festival besides Suprabatam, Vishwaroopa sarva darshan of the moola virat of the deity was allowed to devotes in the morning after Thirumanjanam in ekantham.

The deity of Sri Pundarikavalli ammavaru was given snapana thirumanjanam as part of the utsavam and Asthanam was performed later.

Later in the evening the utsava idols of Sri Pundarikavalli ammavaru will be taken around in the vimana prakaram of the temple and unjal seva is performed.

DyEO of the temple Smt Varalakshmi, AEO Sri Udaya bhaskar and other senior officials participated in the event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన పంగుణోత్తర ఉత్సవం

తిరుప‌తి, 30 మార్చి 2018: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో గల శ్రీ పుండరీకవళ్లి (సాలైనాంచియార్‌) అమ్మవారి పంగుణి ఉత్తర ఉత్సవం శుక్ర‌వారం ఘనంగా ముగిసింది.

ఈ సందర్భంగా ఉదయం అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి విశ్వరూప సర్వదర్శనం కల్పించారు. అనంతరం ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. ఉదయం శ్రీపుండరీకవళ్లి అమ్మవారి సన్నిధిలో వేడుకగా స్నపనతిరుమంజనం జరిగింది. అనంతరం ఆస్థానం నిర్వహించారు.

సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ పుండరీకవళ్లి అమ్మవారిని ఆలయ విమానప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వహించనున్నారు. ఆ త‌రువాత‌ ఊంజల్‌సేవ చేపడతారు. ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వ‌ర‌ల‌క్ష్మి, ఏఈవో శ్రీ ఉద‌య‌భాస్క‌ర్ ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌బ‌డిన‌ది.