VENKANNA RIDES GOLDEN CHARIOT_ స్వర్ణరథంపై ఊరేగిన కోనేటిరాయుడు

Tirumala, 30 March 2018: As part of the ongoing Srivari Annual Vasanthotsavam, Sri Malayappaswamy along with consorts Sri Devi and Bhudevi blessed the devotees while they rode on the Golden Chariot on the Mada Streets.

Thousands of devotees participated in the celestial event chanting Govinda, Govinda as they dragged the Golden chariots in the moning.

Speaking on the ocassion TTD EO Sri Anil Kumar Singhal said that Swarna Rathotsavam was organised on the second day of the annual Vasanthotsavam.

He said on the third day of the Vasanthotsavam Sri Malayappaswamy will be accompanied by the Sri Sitarama Lakshmana and Anjaneya besides the Sri Krishna swamy along wit Sri Rukmini.

After the Vasanthotsavam at the Vasantha mandapam the utsava idols will be given Abhishekam as per Agama traditions and later returned to the temple in the evening. Snapana Thirumanjanam was also performed to the utsava idols in the afternoon with Milk, Curd, Coconut water, Honey, turmeric water and Sandal paste.

In view of the annual festival TTD has cancelled the arjita sevas of kalyanotsavams, unjal seva, Arjita Brahmotsavam and Sahasra deepalankara sevas on March 31.

Among others Supreme court Justice Sri NV Ramana, Tirupati MLA Smt Sugunamma, Tirumala JEO Sri KS Sreenivasa Raju, SE Sri Ramachandra Reddy, DyEO Sri Harindranath, VSO Sri Ravindra Reddy and others participated in the event.
POURNAMI GARUDA SEVA CANCELLED:

The TTD has cancelled the monthly Pournami Garuda Seva on March 31, in view of the ongoing annual Srivari Vasantotsavam.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

స్వర్ణరథంపై ఊరేగిన కోనేటిరాయుడు

మార్చి 30, తిరుమల 2018: తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధులతో స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులను అనుహించారు.

ఇందులో భాగంగా ఉదయం 8.00 నుండి 9.00 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన ఈ స్వర్ణరథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ, తాము కూడా రథాన్ని లాగారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ శ్రీవారి వసంతోత్సవాలలో భాగంగా రెండవరోజు స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. మూడవరోజైన మార్చి 31వ తేదీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు కూడా వసంతోత్సవ మండపానికి ఊరేగింపుగా వెళ్ళి వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారని తెలియచేశారు. వసంత్సోవ వేడుకలను పురస్కరించుకొని మార్చి 31వ తేది శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెతవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసిందన్నారు.

అనంతరం స్వామివారు వసంతోత్సవ మండపానికి వేంచేపుచేశారు. అక్కడ అర్చకులు వసంతోత్సవ అభిషేకాదులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కాగా మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి శ్రీ ఎన్‌.వి.రమణ, తిరుపతి ఎమ్‌.ఎల్‌.ఏ.శ్రీమతి సుగుణమ్మ, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఎస్‌ఇ 2 శ్రీరామచంద్రరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్‌, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి, ఇతర తదితరులు పాల్గొన్నారు.

పౌర్ణమి గరుడుసేవ రద్దు

ఈ నెల 31వ తేది శనివారం నిర్వహించవలసిన పౌర్ణమి గరుడసేవను శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకొని టిటిడి రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.