PARAYANA YAGNAM BY TTD WINS LAURELS _ భక్తిభావం పంచుతున్న నాదనీరాజన కార్యక్రమాలు
NADA NEERAJANAM PROGRAMS ENHANCE DEVOTION
Tirumala, 20 February 2022: TTD has been conducting spiritual discourse programs almost for two years seeking Sri Venkateswara blessing to end Corona and securing global health, with various parayanams that which have won devout laurels from across the globe.
At present, in the auspicious Magha Masam the faculty of National Sanskrit University Acharya Sri MG Nandan Rao has been rendering Pravachanam on the significance of Magha Masam every day between 6am and 6:45am.
Balakanda Parayanam which has completed 210 days is being delivered under the supervision of SV Vedic University Acharya Sri Prava Ramakrishna Somayaji as the main narrator along with shloka parayanam recited by Sri Ramanujacharyulu every day between 7am and 8am.
In the evening Sri Vishnu Sahasranama Parayanam is performed between 6pm and 7pm under the stewardship of Dharmagiri Veda Vignana Peetham Acharyas Sri Kuppa Narasimha Sharma, Sri Kumaraswamy.
And between 8pm and 9pm Adi Parvam is rendered by Vedic exponents Sri Seshacharyulu and Sri Satya Kishore.
The SVBC of TTD is presenting live telecast of all these programs at Nada Neerajanam platform for benefit of millions of devotees to pursue devotional activities from their homes.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
భక్తిభావం పంచుతున్న నాదనీరాజన కార్యక్రమాలు
తిరుమల, 2022 ఫిబ్రవరి 20: తిరుమల నాదనీరాజనం వేదికపై ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో నిర్వహిస్తున్న ధార్మికోపన్యాసాలు, పారాయణ కార్యక్రమాలు భక్తిభావాన్ని పంచుతున్నాయి. కరోనా వైరస్ ను మానవాళికి దూరం చేసి, ఆరోగ్యం, శాంతి సౌఖ్యాలు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ సుమారు రెండేళ్లుగా పారాయణ కార్యక్రమాలను టిటిడి నిర్వహిస్తోంది.
– ఉదయం 6 నుంచి 6.45 గంటల వరకు మాస వైశిష్ట్యం ప్రసారమవుతుంది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు శ్రీ ఎం.జి.నందన్ రావు ప్రస్తుతం మాఘ మాస వైశిష్ట్యాన్ని భక్తులకు తెలియజేస్తున్నారు.
– ఉదయం 7 నుంచి 8 గంటల వరకు బాలకాండ పారాయణం జరుగుతోంది. సుమారు ఐదు నెలలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య ప్రవా రామకృష్ణ సోమయాజి ప్రధాన వక్తగా ఉండగా, శ్రీ రామానుజాచార్యులు శ్లోకపారాయణం చేస్తున్నారు.
– మధ్యాహ్నం వేళ 2 నుంచి 4 గంటల మధ్య నాదనీరాజనం అనే కార్యక్రమం పేరిట ప్రముఖ సంగీత విద్వాంసులు, నృత్య కళాకారులతో శాస్త్రీయ సంగీతం, నృత్యం, హరికథ తదితర కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి.
– సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు విష్ణుసహస్రనామ పారాయణం జరుగుతోంది. జనవరి 14వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రసారం అవుతోంది. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు శ్రీ కుప్పా నరసింహశర్మ, శ్రీ కుమారస్వామి ఈ పారాయణం చేస్తున్నారు.
– రాత్రి 8 నుంచి 9 గంటల వరకు ఆదిపర్వం పారాయణం జరుగుతోంది. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు శ్రీ కె.వి.శేషాచార్యులు, శ్రీ సత్య కిషోర్ ఈ పారాయణం చేస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. తద్వారా లక్షలాది మంది భక్తులు తమ ఇళ్ల నుంచే ఈ కార్యక్రమాలను వీక్షించి తరిస్తున్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.