PARAYANAMS ENHANCES DHARMIC VALUES IN THE SOCIETY – KANCHI KAMAKOTI PEETHADHIPATI _ పారాయణాలతో సమాజంలో ధార్మిక విలువలు పెంపు _ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి
AYODHYAKANDA COMMENCES AT NADANEERAJANAM
TIRUMALA, 17 MAY 2023: Hailing the decision of TTD for having started the Parayanams in Tirumala, the Kanchikamakoti Peethadhipathi Sri Sri Sri Vijayendra Saraswathi Mahaswamy said, the recitation of various epics will enhance Dharmic values in the society.
The Pontiff graced the Ayodhyakanda Parayanam commencing event held at Nada Neerajanam in Tirumala on Wednesday along with the TTD EO Sri AV Dharma Reddy.
In his message on the occasion, the Pontiff said, the epics Ramayana and Maha Bharata are eternal guides to the human race to lead a righteous and pious life. “It is heartening to note that the Tirumala Tirupati Devasthanams has commenced this noble mission of Parayana Yagnam since the Covid Pandemic to protect the entire humanity from the evil virus and is successfully taking forward the spiritual program from the past three years. I appreciate the zeal of the Executive Officer Sri AV Dharma Reddy to give the essence of our epics to the world through these Parayanams”, he said.
The Pontiff also said, each and every character in Ramayana teaches the value of a pious relationship in Dasaratha as an icon of Father’s love, Sri Rama as a true son, Sita as a responsible wife, Lakshmana, and Bharata showcases the sibling love, Hanuman as a noble servant to his master and many more. “This is the reason why Srimad Ramayana and Maha Bharata are immortal even after several eons. And they will remain perennial for generations to come”, he asserted.
Earlier Sri AV Dharma Reddy in his words of introduction about the program said, after successfully completing Sundarakanda, Balakanda now TTD has commenced Ayodhyayakanda which has over 4000 Shlokas.
SV Vedic University Vice Chancellor, Sri Rani Sadasiva Murthy, National Sanskrit University Professor Sri Kuppa Vishwanatha Sharma, Dharmagiri Veda Vignana Peetham Principal Sri KSS Avadhani also spoke on the occasion.
Before the commencement of Parayanam, Dr. Balakrishna Prasad, the Asthana Vidhwan of TTD, and his team rendered “Saranu Saranu Neeku .. Jagadeka Vandita” Annamachaya Sankeertan in a melodious manner.
Renowned scholars of Dharmagiri, Sri Ramanujacharyulu will narrate the importance of each Sloka while Sri Ananta Venugopal will render the Sioka Parayanam for Ayodhyakanda which will be live telecasted by SVBC between 7 am and 8 am every day for the sake of global devotees.
Annamacharya Project Director Dr. Vibhishana Sharma was also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
పారాయణాలతో సమాజంలో ధార్మిక విలువలు పెంపు
కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి
నాదనీరాజనంపై అయోధ్యకాండ పారాయణం ప్రారంభం
తిరుమల, 2023 మే 17రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాల పారాయణం వల్ల సమాజంలో ధార్మిక విలువలు పెంపొందుతాయని, ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్న టిటిడిని అభినందిస్తున్నానని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి ఉద్ఘాటించారు. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం జరిగిన అయోధ్యకాండ పారాయణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి స్వామీజీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఇతిహాసాలు మానవ జాతి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి శాశ్వత మార్గదర్శకాలన్నారు. కోవిడ్ మహమ్మారి నుండి మానవాళిని రక్షించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ పారాయణ యజ్ఞాన్ని ప్రారంభించి మూడు సంవత్సరాలుగా టిటిడి విజయవంతంగా నిర్వహిస్తోందని కొనియాడారు. పారాయణాల ద్వారా ఇతిహాసాల సారాన్ని ప్రపంచానికి అందించాలని ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు.
రామాయణంలోని పాత్రలు ఆదర్శనీయంగా నిలుస్తాయని, తండ్రి ప్రేమకు చిహ్నంగా దశరథుడు, శ్రీరాముడు తండ్రి మాటను శిరసావహించే కుమారుడిగా, సీత బాధ్యతాయుతమైన భార్యగా, లక్ష్మణుడు, భరతులు సోదరప్రేమకు ప్రతీకగా, హనుమంతుడిని గొప్ప సేవకునిగా అభివర్ణించారు. రామాయణ, మహాభారతాలు అనేక యుగాల తర్వాత కూడా అజరామరంగా ఉండటానికి ఇదే కారణమన్నారు.
ముందుగా ఈవో శ్రీ ఎ.వి.ధర్మా రెడ్డి మాట్లాడుతూ సుందరకాండ, బాలకాండను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత 4 వేలకుపైగా శ్లోకాలు గల అయోధ్యాకాండను ప్రారంభించామన్నారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీ రాణి సదాశివమూర్తి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కేఎస్‌ఎస్.అవధాని తదితరులు మాట్లాడారు.
పారాయణం ప్రారంభానికి ముందు, టిటిడి ఆస్థాన విద్వాంసులు డాక్టర్ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ బృందం “శరణు శరణు నీకు .. జగదేక వందిత” అన్నమాచార్య సంకీర్తనను రాగయుక్తంగా ఆలపించారు.
ధర్మగిరికి చెందిన ప్రఖ్యాత పండితులు శ్రీ రామానుజాచార్యులు ప్రతి శ్లోకం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తారు. శ్రీ అనంత వేణుగోపాల్ శ్లోక పారాయణం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ప్రతిరోజూ ఉదయం 7 నుండి 8 గంటల మధ్య ఎస్వీబీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. విభీషణ శర్మ తదితరులు, భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.