PARVETA UTSAVAM HELD AT TIRUMALA _ తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం

Tirumala, 16 January 2024: TTD grandly organised the annual Parveta utsavam at Tirumala on Tuesday evening.

Both the utsava idols of Sri Malayappa Swamy as Panchayudhamurty and Sri Krishna Swamy were brought on separate Tiruchis to Parveta Mandapam and offered Punyaham Vachanam, Aradhana, Nivedana and Harati besides honours to Tallapaka and Mutt representatives.

Sri Krishna Swamy was presented with milk, butter separate pujas at Yadava Sannidhi.

Thereafter Sri Malayappaswami participated in Parveta utsavam as archakas threw arrows thrice in this mock hunt and later the deities returned with Hathiramji stick.     

TTD Chairman Sri Bhumana Karunakara Reddy, JEO Sri Veerabrahmam, SE-2 Sri Jagadeeshwar Reddy, DyEO Sri Lokanatham, other senior officials and devotees were present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం

తిరుమల, 2024 జనవరి 16: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవము మంగళవారం ఘనంగా జరిగింది.

ఇందులో భాగంగా మంగళవారం మ‌ధ్యాహ్నం 1 గంట‌కు శ్రీమలయప్పస్వామివారు తిరుచ్చిలో వేంచేసారు. వారి వెంట మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామి వేంచేసారు.

అనంతరం పార్వేట మండపము నందు పుణ్యాహము, ఆరాధన, నివేదనము జరిగి హారతులు జరిగాయి. అనంత‌రం ఉభయదార్లకు తాళ్ళపాక వారికి, మఠంవారికి మర్యాదలు జరిగాయి.

శ్రీ కృష్టస్వామివారిని సన్నిధి యాద‌వ పూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలు, వెన్న, హారతులు సమర్పించారు.

తరువాత శ్రీ మలయప్పస్వామివారు ముందునకు కొంత దూరము పరుగెత్తి వారి తరపున అర్చకులు బాణమువేసిన పిమ్మట వెనుకకు వచ్చారు. ఇట్లు మూడుసార్లు జరిగింది.

శ్రీ మలయప్పస్వామివారు ఉత్సవము పూర్తయి మహాద్వారమునకు వచ్చి హత్తీరాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వేంచేసారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పార్వేట ఉత్సవము ఘనంగా ముగిసింది.

ఈ ఉత్సవంలో టిటిడి చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎస్ ఇ -2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర ఉన్నతాధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.