PARUVETA UTSAVAM IN TIRUMALA ON JANUARY 15 _  జనవరి 15న శ్రీ‌వారి పార్వేట ఉత్సవం

Tirumala, 9 January 2021: The Paruveta Utsavam, which will be observed in connection with Kanuma, a day after the Makara Sankranthi festival, will be celebrated on January 15 at Tirumala.

Sri Malayappa Swamy and Sri Krishna Swamy will be brought to Paruveta Mandapam at around 1pm, where Archakas offer Aradhanas, Nivedana and Harati.

Sri Krishna Swamy will be offered puja first by Sannidhi Yadava where milk and butter are rendered as Naivedyam and later he joins Sri Malayappa Swamy at Paruveta Mandapam.

Sri Malayappa Swamy is also offered milk and butter brought from Sannidhi. Later Sri Malayappa participates in the mock hunting (Paruveta) which begins with the shooting of arrows that will be enacted thrice.

While returning from Parveta Mandapam to Srivari temple, Sri Malayappa receives a stick presented by the representatives of Hathiramji Mutt.

In view of Parveta Utsavam, TTD has cancelled the arjita sevas including Kalyanotsavam, Unjal Seva, and Arjita Brahmotsavam and Sahasra Deepalankara seva on January 15.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

జనవరి 15న శ్రీ‌వారి పార్వేట ఉత్సవం

తిరుమల, 2021 జనవరి 09: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున  కనుమ పండుగనాడైన జనవరి 15న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు.
       
గోదాపరిణయోత్సవం సంద‌ర్భంగా ఉద‌యం 5.30 గంట‌ల‌కు ఆండాళ్ అమ్మ‌వారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్‌స్వామి మ‌ఠం నుండి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకు వెళ్ళి స్వామివారికి స‌మ‌ర్పిస్తారు.

ఆనంత‌రం మధ్యాహ్నం 1.00 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంత‌రం స్వామివారు ఆల‌యానికి చేరుకుంటారు.

ఆర్జితసేవలు రద్దు :

ఈ ఉత్సవాల కారణంగా జనవరి 15న శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.