PARVETA UTSAVAM AT SKVST _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా పార్వేట ఉత్సవం

Srinivasa Mangapuram, 28 Jun. 20: The traditional festival of Paruveta Utsava was grandly conducted on Sunday at Sri Kalyana Venkateswara temple in Srinivasa Mangapuram.

As a part of the fete, the utsava idols were brought to Mukha Mandapam after daily rituals of and were offered harati and nivedana.

In view of Coronavirus restrictions, all the events were performed in Ekantham inside the temple.

Temple Dyeo Sri Yellappa, AEO Sri K Dhananjayudu, Chief Priest Sri Balaji Swamy and other staffs participated. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా పార్వేట ఉత్సవం

తిరుపతి, 2020 జూన్ 28: శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో ఆది‌వారం స్వామివారి పార్వేట ఉత్సవం జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని  మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు ఆల‌య ముఖ మండ‌పంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారిని వేంచేపు చేసి యాద‌వ హార‌తి (గొల్ల‌వాని హార‌తి), క్షేమ‌త‌లిగ‌, ఆస్థానం, నివేద‌న నిర్వ‌హించారు.‌ 

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా ఆల‌యంలో ఏకాంతంగా ఆస్థానం నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ య‌ల్ల‌ప్ప‌, ఏఈవో శ్రీ కె.ధ‌నంజ‌యుడు, ఆలయ ప్రధానార్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగల్రాయులు, శ్రీ రమణయ్య  పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.