JEO RELEASES SRI PAT WALL POSTERS_ శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయ సేవల గోడ పత్రికల ఆవిష్కరణ:

Tirupati, 2 Mar. 19: As part of extended publicity campaign on devotee services at Sri Padmavati Ammavari Temple, JEO Tirupati Sri B Lakshmi Kantham released wall posters on Saturday.

Speaking after the event at JEO camp office, he said that the campaign was to popularise the daily, weekly monthly and annual events at Sri Padmavati Ammavari temple, Tiruchanoor, to appraise devotees on day’s activities.

The posters should be displayed at all TTD guesthouses; RTC bus stands to spread publicity about activities in Goddess Padmavati temple. Similarly Audio clips of Goddess Padmavati lores and sankeertans were being designed. 3D laser cum Projection mapping apps were also designed to give devotees a wholesome experience through their smartphones.

The JEO said all round development activities were taken up at the temple town in a phased manner as per master plan to attract devotees to Tiruchanoor temple on par with Srivari Temple at Tirumala.

He said the objective of campaign is to spread awareness among devotees that they should visit Sri Padmavati Ammmavari temple after visit to Sri Varahaswami and Srivari temples at Tirumala. To complete their pilgrimage.

He said all steps were made on a war footing to spread complete awareness among devotees on history and significance of all local temples.

Secretary of TTDs HDPP Dr. Ramana Prasad and other officials participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయ సేవల గోడ పత్రికల ఆవిష్కరణ:

మార్చి 02, తిరుపతి, 2019: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ సేవల గోడ పత్రికలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి. లక్ష్మీకాంతం శనివారం ఆవిష్కరించారు. తిరుపతిలోని జెఈవో క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నిత్యోత్సవ, వారోత్సవ, మాసోత్సవ, వార్షికోత్సవ సేవలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. అందులోభాగంగా ప్రత్యేక గోడ పత్రికలను రూపొందించామని, తద్వారా ఏ రోజు ఏ సేవలు ఉన్నాయనే విషయాలు భక్తులు సులభంగా తెలుసుకోవచ్చన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌, టిటిడి విశ్రాంతి భవణాలు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాలలో విరివిగా ప్రచారం చేపట్టేలా చర్యలు చేపట్టామన్నారు. బస్సులలో అమ్మవారి నామాలు, సంకీర్తణలను భక్తులకు వినిపించేలా ఆడియో సిడిలను రూపొందిస్తున్నామని తెలిపారు. 3డి లేజర్‌ కమ్‌ ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ ద్వారా పద్మపుష్కరిణిలో అమ్మవారి పురాణ మహిమను తెలియజేసేలా రూపాలు నీటిలో కనిపించేలా చిత్రీకరిస్తామన్నారు. మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా దశలవారీగా తిరుచానూరులో అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు.

భక్తులు తిరుమలలో ముందుగా శ్రీ వరాహస్వామివారిని, ఆ తరువాత శ్రీవారిని దర్శించుకోవాలని, వరుసగా తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని, టిటిడి స్థానిక ఆలయాలను దర్శించుకుంటే సంపూర్ణ దర్శనం అవుతుందన్నారు. ఆలయాల స్థలపురాణం, ప్రాముఖ్యత తదితర అంశాలపై భక్తులకు తెలిసేలా ఏర్పాట్లు చేపట్టామన్నారు.

ఈ కార్యక్రమాల్లో టిటిడి హింధూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా. రమణప్రసాద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.