PATRIOTIC WAVE AT TTD PARADE GROUNDS _ టిటిడి పరిపాలనా భవనంలో మువ్వన్నెల జెండా రెపరెపలు
Tirupati, 26 Jan. 20: The 71st Republic Day has witnessed grand gala of celebrations at the TTD Parade Grounds on Sunday.
The National Day commenced with Executive Officer Sri Anil Kumar Singhal hoisting the Tricolour flag on the occasion.
An attractive parade by TTD vigilance staff led by AVSO Sri Nandeeswar Rao stole the show. It was followed by EO’ s address to the TTD employees and presentation of one Srivari silver dollar and an appreciation letter to 24 officials and 205 other employees of all departments by him for their mertorious contributions.
On the occasion the 20 member private security team led by Srinivas highlighted the arrangements made by TTD to avert accidents on ghat roads. A display of dogs of bomb squad in detecting drugs and explosives and a human pyramid display by TTD security staff held the audience enthralled.
The attractive dance and patriotic songs presented by students of various TTD educational institutions including Annamacharya sankeertans won the applause.
Additional EO Sri A V Dharma Reddy, JEO Sri P Basant Kumar, CVSO Sri Gopinath Jatti, Additional CVSO Sri Shiva Kumar Reddy, FA and CAO Sri O Balaji ,VSO Sri Prabhakar Rao other officials and employees participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
టిటిడి పరిపాలనా భవనంలో మువ్వన్నెల జెండా రెపరెపలు
జనవరి 26, తిరుపతి 2020 : తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో భారత గణతంత్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్ మైదానంలో టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.
ఈ సందర్భంగా టిటిడి భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్‌వో శ్రీనందీశ్వర్‌రావు పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. అనంతరం టిటిడి ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 24 మంది అధికారులు, 205 మంది ఉద్యోగులకు ఐదు గ్రాముల శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం అందజేశారు. టిటిడి భద్రతా సిబ్బంది కవాతులో విశ్రాంత సైనిక దళానికి శ్రీ పి.మనోహర్, శ్రీవారి భద్రత(రెడ్ షర్ట్స్) సిబ్బందికి శ్రీ బద్రి, సెక్యూరిటీ గార్డు సిబ్బందికి శ్రీ రామకృష్ణ, ఎస్‌పిఎఫ్ సిబ్బందికి శ్రీ కె.భార్గవ్, ఖాకీ షర్ట్స్ సిబ్బందికి శ్రీ బి.శశికుమార్, మహిళా సెక్యూరిటీ సిబ్బందికి కుమారి జి.కోమల నాయకత్వం వహించారు. బ్యాండ్ మాస్టర్‌గా శ్రీ బి.బసవయ్య వ్యవహరించారు.
ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణపై అవగాహన
ఘాట్ రోడ్లలో ప్రమాదాలకు దారి తీస్తున్న పరిస్థితులు, వాటి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై 26 మంది శ్రీనివాస ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బంది చక్కటి అవగాహన కల్పించారు. ధ్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్ మాట్లాడడం వల్ల కలిగే ప్రమాదాలను కళ్లకు కట్టినట్టు చూపారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలియజేశారు. అదేవిధంగా, బాంబ్ స్క్వాడ్ ప్రదర్శనలో శునకాల ద్వారా బాంబులు, ఇతర పేలుడు పదార్థాలను గుర్తించి నిర్వీర్వ్యం చేయడాన్ని చూపారు. డాగ్ షోలో శునకాలు మాదకద్రవ్యాలు, ఎర్రచందనం తదితర పదార్థాలను గుర్తించడాన్ని ప్రదర్శించారు. భద్రతా సిబ్బంది పిరమిడ్ ప్రదర్శన ఆకట్టుకుంది.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులు ఓం నమో భరతాంబికే… అనే దేశభక్తి గీతానికి చక్కటి నృత్యం ప్రదర్శించారు. టిటిడిలోని అన్ని పాఠశాలల విద్యార్థులు కలిసి భరతమాత ముద్దుబిడ్డలం…. అనే గేయానికి చక్కగా అభినయించారు. ఎస్‌జిఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రక్తదాన విలువను తెలుసుకుందాం అనే అంశంతో జానపదశైలిలో నృత్య ప్రదర్శన చేశారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాల విద్యార్థినులు జిమ్నాస్టిక్స్, ఎస్వీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు అన్నమయ్య సంకీర్తన నృత్యం, ఎస్వీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సురేంద్ర నాయక్ కుమార్తె బి.చాతుర్య అదివో అల్లదివో…. అనే కీర్తనకు చక్కటి భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమానికి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా|| వి.కృష్ణవేణి, శ్రీ వి.రమేష్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్ జెట్టి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎఫ్‌ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, విఎస్‌వో శ్రీ ప్రభాకర్‌రావు ఇతర విభాగాధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.