VALMIKIPURAM PATTABHISHEKA MAHOTSAVAMS FROM AUGUST 15-17_ వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

Srinivasa Mangapuram, 2 August 2018: The Pattabhisheka Mahotsavams of Sri Pattabhi Rama Swamy in Valmikipuram will be observed on August 16 and 17 with Ankurarpanam on August 15.

On August 16, there will be Yagasala Pujas, Unjal Seva, Sri Sita Ramakalyanam and Hanumantha Vahana Sevas while on August 17, Garuda Vahana seva will be observed.

Temple DyEO Sri Venkataiah released the posters for the same in Sri Kalyana Venkatewara Swmay temple in Srinivasa Mangapuram on Thursday.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

తిరుపతి, 2018 ఆగస్టు 02: చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాల పోస్టర్లను ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటయ్య గురువారం ఉదయం శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డెప్యూటీ ఈవో మాట్లాడుతూ ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు పట్టాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీన సాయంత్రం 6.00 గంటలకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.

ఆగస్టు 16వ తేదీన ఉదయం 8.00 నుడి 10.00 గంటల వరకు యాగశాలపూజ, ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్నపనతిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజలసేవ, రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం జరగనుంది. రాత్రి 9.00 నుండి 10.00 గంటల వరకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు.

ఆగస్టు 17వ తేదీన ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు యాగశాల పూజ, స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 9.00 గంటల నుండి శ్రీ రామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరుగనుంది. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకుఊంజలసేవ, రాత్రి 7.30 గంటల నుండి గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు.

గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాన్ని బహుమానంగా అందజేస్తారు. మూడు రోజుల పాటు టిటిడి హిందూధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ శ్రీనివాసులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ అనిల్‌కుమార్‌, శ్రీకేదరీశ్వర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.