PAVITRA GARLANDS DECKED IN PAT_ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా పవిత్ర సమర్పణ

Tiruchanoor, 13 Sep. 19: As a part of the ongoing annual Pavitrotsavams in Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor, the sacred silk woven thread garlands were decked to the presiding and utsava deities on Friday.

Speaking on this occasion TTD EO Sri Anil Kumar Singhal who took part in the fete said, the three annual Pavitrotsavams is being celebrated in a religious manner in the temple. “This fete will conclude with Purnahuti on Saturday. Chakrasnanam will also observed on the occasion”, he added.

Temple DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Suptd Sri Gopalakrishna Reddy and others took part.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా పవిత్ర సమర్పణ

సెప్టెంబర్ 13, తిరుపతి, 2019: తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం పవిత్ర సమర్పణ వైభవంగా జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ప‌విత్రోత్స‌వాల‌ను శాస్త్రోక్తంగా నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. అర్చ‌క‌స్వాములు ఈ రోజు ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హించార‌ని, శ‌నివారం మ‌హాపూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగియ‌నున్నాయ‌ని వివ‌రించారు. ప‌విత్రోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు కృషి చేసిన అర్చ‌క‌స్వాముల‌కు, అధికారుల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

రెండో రోజు కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, అభిషేకం చేపట్టారు. ఆ తరువాత పవిత్ర సమర్పణ, నివేదన, యాగశాలలో తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. ఈ కారణంగా అభిషేకానంత‌ర ద‌ర్శ‌నం, బ్రేక్ ద‌ర్శ‌నం(ఉద‌యం), ల‌క్ష్మీపూజ‌, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ రద్దయ్యాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ మల్లీశ్వరి, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కోలా శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సెప్టెంబరు 14న చక్రస్నానం :

పవిత్రోత్సవాల్లో భాగంగా శ‌నివారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు స్నపనతిరుమంజనం, చక్రస్నానం జరుగనుంది. ఉదయం మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారు, శ్రీ సుందరరాజ స్వామివారు, శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.