TTD DOES TRIAL-RUN FOR HEAVIEST VAHANAM_ స‌ర్వ‌భూపాల వాహ‌నం ప్ర‌యోగాత్మ‌క ప‌రిశీల‌న‌

Tirumala, 13 Sep. 19: As annual brahmotsavams of Sri Venkateswara Swamy in Tirumala is just two weeks away, a trial-run of Sarvabhoopala Vahanam was performed in Tirumala on Friday.

Among the 14 Vahana Sevas (excluding rathams), Sarvabhoopala Vahanam is considered to be the heaviest weighing around 1047kilos.

The trial-run was successfully conducted by the temple officials to avoid any technical issues during the main brahmotsavams.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స‌ర్వ‌భూపాల వాహ‌నం ప్ర‌యోగాత్మ‌క ప‌రిశీల‌న‌

తిరుమల, 2019 సెప్టెంబ‌రు 13: తిరుమలలో సెప్టెంబ‌రు 30 నుండి అక్టోబ‌రు 8వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో శుక్ర‌వారం స‌ర్వ‌భూపాల వాహ‌నాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించారు. సాధార‌ణంగా బ్ర‌హ్మోత్స‌వాల్లో నాలుగో రోజు రాత్రి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు స‌ర్వ‌భూపాల వాహ‌నంపై భ‌క్తులకు ద‌ర్శ‌న‌మిస్తారు.

మొత్తం 14 వాహ‌నాలుండ‌గా, 1,047 కిలోల‌తో స‌ర్వ‌భూపాల వాహ‌నం అత్యంత బ‌రువైన‌ది. కావున‌, బ్ర‌హ్మోత్స‌వాల్లో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ముంద‌స్తుగా ఈ వాహ‌నాన్ని నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వ‌హించి విజ‌య‌వంతంగా ప‌రిశీలించారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌యం, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.