PAVITROTSAVAMS IN JULY 24 TO 26_ శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

Tirupati, 11 July 2018: The annual three-day Pavitrotsavams in Sri Kapileswara Swamy temple will be observed from July 24 to 26 in Tirupati.

Every year during the auspicious (Ashada) Month this festival is being observed in this famous temple of Lord Shiva as per the tenets of Saivagama.

Interested Grihastas can take part in this fete on payment of Rs.500 per ticket on which two persons will be allowed.

Earlier Tirupati JEO Sri P Bhaskar on Wednesday released the posters at his chambers in Tirupati.

Temple DyEO Sri Subrahmanyam, Suptd Sri Rajkumar, Temple Inspectors Sri Narayana, Sri Muralikrishna were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

తిరుపతి, 2018 జూలై 11: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 24 నుండి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాల గోడపత్రికలను బుధవారం సాయంత్రం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. జూలై 23న పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు.

ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో పౌర్ణమి ముందున్న చతుర్దశి నాటికి పూర్తయ్యేలా మూడు రోజుల పాటు స్వామివారికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా ప్రతిరోజూ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం పంచమూర్తులైన శ్రీకపిలేశ్వరస్వామి, శ్రీకామాక్షమ్మ అమ్మవారు, శ్రీవిఘ్నేశ్వరస్వామి, శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీచండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు కల్యాణమండపంలో స్నపనతిరుమంజనం చేపడతారు. మొదటిరోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు గ్రంధి పవిత్ర సమర్పణ, మూడో రోజు మహాపూర్ణాహుతి క్రతువులు నిర్వహిస్తారు.

ఈ పవిత్రోత్సవంను ఆర్జితం సేవగా ప్రవేశపెట్టారు. రూ.500/- చెల్లించి ఇద్దరు గృహస్థులు పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికె, చివరిరోజు పవిత్రమాలలు బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ పి.సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నారాయణ, శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.