PAVITROTSAVAMS IN KT FROM JULY 24_ జూలై 23న శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

Tirupati, 22 July 2018: The annual three day Pavitrotsavams will commence in Sri Kapileswawa Swamy temple on July 24 with Ankurarpanam on July 23.

This is a cleansing festival to waive off the sins committed either knowingly or unknowingly by the religious, non-religious staffs, even pilgrims devotees.

This celestial fete which is observed as per the tenets of Saivagama will conclude on July 26.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 23న శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి, 2018 జూలై 22తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 24 నుండి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలకు జూలై 23వ తేదీ సోమవారం అంకురార్పణ జరుగనుంది.

ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో పౌర్ణమి ముందున్న చతుర్దశి నాటికి పూర్తయ్యేలా మూడు రోజుల పాటు స్వామివారికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా ప్రతిరోజూ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం పంచమూర్తులైన శ్రీకపిలేశ్వరస్వామి, శ్రీకామాక్షమ్మ అమ్మవారు, శ్రీవిఘ్నేశ్వరస్వామి, శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీచండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు కల్యాణమండపంలో స్నపనతిరుమంజనం చేపడతారు. మొదటిరోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు గ్రంధి పవిత్ర సమర్పణ, మూడో రోజు మహాపూర్ణాహుతి క్రతువులు నిర్వహిస్తారు.

ఈ పవిత్రోత్సవాన్ని ఆర్జిత సేవగా ప్రవేశపెట్టారు. రూ.500/- చెల్లించి ఇద్దరు గృహస్థులు పాల్గొనవచ్చు. గృహస్థులకు ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికె, చివరిరోజు పవిత్రమాలలు బహుమానంగా అందజేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.