PAVITROTSAVAM OF SRI PVST APPALAYAGUNTA BEGINS_ వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం
Tirupati, 25 Sep. 19: The holy ritual of Pavitrotsavam Of TTD local temple of Sri Prasanna Venkateswara Swamy Temple of Appalayagunta commenced on Wednesday.
After morning rituals, Pavitra pratista was performed by ritwiks followed by snapana thirumanjanam for the utsava idols of Lord and his consorts. Later in the evening, they were taken out on Mada streets and vedika programs continued the yagasala.
Temple Superintendent Sri Gopalakrishna Reddy, archakas and others participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2019 సెప్టెంబరు 25: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు. ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. రాత్రి యాగశాల వైదిక కార్యక్రమాలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, అర్చకులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.