PAVITROTSAVAMS CONCLUDES IN KRT_ ఘనంగా ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు

Tirupati, 21 July 2017: The annual three-day pavitrotsavams concluded on a grand religious note in the famous temple of Lord Sri Kodanda Rama Swamy in Tirupati on Friday.

On the final day after Snapanam to the deities, Tiruveedhi utsavam was performed in the evening.

It was later followed by Maha Purnahuti which marked the ceremonial conclusion of the festival.

Temple DyEO Smt Munilakshmi, Temple Inspector Sri Sesha Reddy were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఘనంగా ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు

తిరుపతి, 2017 జూలై 21: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శుక్రవారం రాత్రి పూర్ణాహుతితో ఘనంగా ముగియనున్నాయి. ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 11.00 నుండి 12.30 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల గుడి వద్ద యిహల్‌ శాత్తుమొర నిర్వహించనున్నారు. రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. రాత్రి 8.30 నుండి 10 గంటల వరకు పూర్ణాహుతి, ఉత్సవమూర్తులను, ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణంగా సన్నిధికి చేర్చడం, కుంభా ఆవాహన తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో తితిదే స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి బి.మునిలక్ష్మి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శేషారెడ్డి ఇతర అధికార ప్రముఖులు,

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.