VALMIKIPURAM CORONATION CEREMONY OF SRI RAMA FROM JULY 28-30_ జూలై 28 నుండి 30వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు
Tirupati, 21 July 2017: The Pattabhisheka Mahotsavams of Sri Pattabhi Rama Swamy temple in Valmikipuram will be observed by TTD from July 28-30 in a big way.
The Beejavapanam ritual for this three day ceremony will be observed on July 28 while on July 29 Snapana Tirumanjanam will be performed in the morning, Shanti Kalyanam and Hanumantha Seva in the evening.
On July 30, Coronation Ceremony will be observed in a big way followed by Garuda Seva in the evening.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జూలై 28 నుండి 30వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు
తిరుపతి, 2017 జూలై 21: చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు జూలై 28 నుండి 30వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. జూలై 28న అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. మొదటిరోజు సేనాధిపతి ఉత్సవం జరుగనుంది.
జూలై 29వ తేదీన ఉదయం యాగశాల పూజ, స్నపనతిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం శాంతి కళ్యాణం, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు. జూలై 30న ఉదయం యాగశాల పూజ, స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరుగనుంది. రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణం నిర్వహించనున్నారు.
గహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గ హస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
ఈ మూడు రోజుల పాటు తితిదే హిందూధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.