PAVITHROTSAVAM AT SRI KALYANA VENKATESWARA SWAMY TEMPLE, S MANGAPURAM_ అక్టోబరు 15 నుండి 17వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు

Tirupati, 8 October 2017: The celestial three day ritual of Pavithrotsavam will be held from October 15 to 17 in the Sri Kalyana Venkateswaraswamy Temple at Srinivasa Mangapuram with Ankurarpanam on Oct 14.

Pavithrotsavam is an once in a year ritual performed to ward off wrong doings inadvertently committed by either temple staff or devotees and included practices like Alaya Shuddi and Punya Havachanams.

The three day ritual included Snapana Thirumanjama, evening vahana processions, Pavitra sthapana, pavitra samarpanam and Purnahuti on final day.

As a result of day long event, the TTD has cancelled the Kalyanotsavams on all three days and also Swarna pushparjana arjita seva on October 17. Interested devotee couple could participate with a contribution of Rs,500 and also beget prasadam of one pavitram,one Uttariyam,one blouse and Anna prasadam.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

అక్టోబరు 15 నుండి 17వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు

అక్టోబరు 08, తిరుపతి, 2017: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 15 నుండి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. అక్టోబరు 14వ తేదీన సాయంత్రం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయి.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అక్టోబరు 15వ తేదీన ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం వీధి ఉత్సవం, రాత్రి పవిత్ర ప్రతిష్ఠ చేపడతారు. అక్టోబరు 16న ఉదయం స్నపనతిరుమంజనం, పవిత్రసమర్పణ, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహిస్తారు. అక్టోబరు 17న ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం వీధి ఉత్సవం, రాత్రి పూర్ణాహుతి జరుగనున్నాయి.

పవిత్రోత్సవాల కారణంగా అక్టోబరు 15 నుంచి 17వ తేదీ వరకు కల్యాణోత్సవం, అక్టోబరు 17న స్వర్ణపుష్పార్చన ఆర్జితసేవలను రద్దు చేశారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.