PRESIDENT OF SRILANKA OFFERED PRAYERS TO LORD VENKATESWARA_ సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు గౌ|| శ్రీ మైత్రిపాల సిరిసేన

Tirumala 8 October 2017:
President of Sri Lanka Mr. Maithripala Sirisena accompanied by his wife Ms Jayanthi Pushpa Kumari
and Son Sri Daham Sirisena offered Prayers to Lord Venkateswara at Tirumala on wee hours of Sunday morning during Suprabatham Seva. On his arrival at infront of Srivari Temple TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju have welcomed the President.

After darshan of Lord, the President was given holy water – Teertham, and was extended Satari honours.

TTD Executive Officer, Tirumala JEO presented Sri Vari Prasadam, 12 Sheet Calendar-2018 and Photo Frame, the veda pundits of the temple have blessed him with Vedic Hymns at Ranganayakula Mandapam.

Temple DyEO Sri Rama Rao, Temple Peishkar Sri Ramesh, Reception Officials Sri Haridranath, Sri Lakshminarayana, VGO Sri Raveendra Reddy and other officials were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు గౌ|| శ్రీ మైత్రిపాల సిరిసేన

అక్టోబరు 08, తిరుమల, 2017: శ్రీలంక అధ్యక్షుడు గౌ|| శ్రీ మైత్రిపాల సిరిసేన సతీసమేతంగా ఆదివారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న శ్రీ మైత్రిపాల సిరిసేన దంపతులకు టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు కలిసి స్వాగతం పలికారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జెఈవో శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు కలిసి శ్రీలంక అధ్యక్షునికి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం , 2018 క్యాలెండర్, డైరీలను అందజేశారు.

ఆ తరువాత శ్రీలంక అధ్యక్షుడు గౌ|| శ్రీ మైత్రిపాల సిరిసేన దంపతులు ఆలయం నుండి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్నారు. అల్పాహారం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు.

ఈ కార్యక్రమంలో టిటిడి, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.