PAVITHROTSAVAM BEGINS IN SRI KRT_ శ్రీ కోదండరామాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

Tirupati, 28 Jul. 19: The holy ritual of Pavitrotsavam, aimed at warding of bad impact of lapses in festivals etc. in TTD local temple of Sri Kodandarama Swamy temple commenced on Sunday.

Promoted by TTD with the objective to protect the divine charm of the temple the first day programs included Sahasra namarchana, snapana thirumanjanam for utsava idols at yagashala followed by Sattumora and Asthanam.

Later in the evening the utsava idols of Sitarama and Lakshman were paraded on mada streets to bless the devotees.

TTD has introduced the event as an arjita seva so that interested couple could participate by purchasing Rs.500 tickets and beget one uttarium, one blouse, and one Pavitra Mala on final day as Prasadam and blessings.

DyEO Smt VR Shanti, AEO Sri Thirumalaiah, Superintendent Sri Ramesh, Temple inspector Sri Ramesh and others participated.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కోదండరామాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుప‌తి, 28 జూలై 2019: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

మొదటిరోజు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.

సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు శ్రీసీతారామలక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమివ్వనున్నారు. రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాన్ని ఆర్జిత సేవగా ప్రవేశపెట్టారు. రూ.500/- చెల్లించి ఇద్దరు గృహస్థులు పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు ఉత్తరీయం, రవికె, చివరి రోజు ఒక పవిత్రమాలను బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి విఆర్‌.శాంతి, ఏఈవో శ్రీ ఎస్‌.తిరుమ‌ల‌య్య‌, సూప‌రింటెండెంట్ శ్రీ ర‌మేష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ర‌మేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.