PAVITHROTSAVAM COMMENCES AT SRI GT WITH ANKURARPANAM_ శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

Tirupati, 31 August 2017: Ankurarpanam was performed at the Sri Govindaraja Swamy temple, here as part of the three day long Pavitrotsavam event.

Temple priests performed Senadhipathi Tiruveedhi event and Mrutsam grahana, Punyavachanam and Vishesha puja in the evening. Special rituals will also be performed in the temple to ward off evil effect of misshapennings in temple and uphold the sanctity of the temple.

Devotees interested in the Pavitrotsavam could participate with payment of Rs 500 per couple and receive one Pavitram as prasadam. Cultural program including harikatha and bhakti sangeet will be conducted in the Sri GRT temple premises by the artists of HDPP, Annamacharya project every day.

SPECIAL EVENTS IN SRI GOVINDARAJA SWAMY TEMPLE IN SEP

September 1-3: Vahana Seva in mada streets as part of the Pavitrotsavam in the evenings.

September 4: Vahana Seva of Kalyana Venkteswara swamy with consorts in the evening.

September 6: Garuda vahanam on eve of Pournami.

September 8,15,22, and 29: Andal Ammavari procession on each Fridays in Mada streets.

September 13: Procession of Sri Parthaswami with consorts on mada streets on Rohini nakshatram.

September 20 on Uttara Nakshatra Sri Govindaraja swami with consorts vahana seva on mada streets.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి,2017 ఆగస్టు 31: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది.

ఇందులో భాగంగా సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సేనాధిపతి తిరువీధి ఉత్సవము, సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు యాగశాల నందు మృత్సంగ్రహణం, పుణ్యహవచనం, విశేషపూజ, అంకురార్పణ ఘట్టాలు నిర్వహించనున్నారు.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు.

సెప్టెంబరు 1వ తేదీ శుక్రవారం పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 2న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 3న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.500/- చెల్లించి గృహస్తులు (ఇద్దరు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సెప్టెంబరులో శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ భూ సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

– సెప్టెంబరు 4న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు తిరు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

– సెప్టెంబరు 6న పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.

– సెప్టెంబరు 8, 15, 22, 29వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు.

– సెప్టెంబరు 13న రోహిణి నక్షత్రం సందర్బంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

– సెప్టెంబరు 20న సాయంత్రం 5.30 గంటలకు ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.