PAVITROTSAVAMS IN KRT COMMENCES_ శ్రీ కోదండరామాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

Tirupati, 19 July 2017: The three day pavitrotsavams commenced in Sri Kodanda Rama Swamy temple in Tirupati on Wednesday.

Snapana Tirumanjanam was performed to processional deities in this connection between 11am and 12:30pm.

Later in the evening Sri Sita Lakshmana Sametha Sri Kodanda Rama Swamy was taken on a celestial procession along four mada streets on Golden Tiruchi between 6pm and 6:30pm.

On the first day evening, Pavitra Pratishtha and Sayanadhivasam ceremonies were performed in the temple between 7pm and 9:30pm


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కోదండరామాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2017 జూలై 19: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు బుధవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

మొదటిరోజు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ ఉదయం 11.00 నుండి 12.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు శ్రీ సీతారామలక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమివ్వనున్నారు. రాత్రి 7.00 నుండి 9.30 గంటల వరకు పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం నిర్వహిస్తారు.

ఈ పవిత్రోత్సవాన్ని ఆర్జిత సేవగా ప్రవేశపెట్టారు. రూ.500/- చెల్లించి ఇద్దరు గ హస్థులు పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న గ హస్థులకు ఉత్తరీయం, రవికె, చివరి రోజు ఒక పవిత్రమాలను బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి బి.మునిలక్ష్మి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శేషారెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.