PARENTS INFANTS BELOW FIVE YEARS HAD DARSHAN OF LORD_ సుపథం ద్వారా ఐదేళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం

Tirumala, 19 July 2017: Considering the feedback from the pilgrims, under the instructions of TTD EO Sri Anil Kumar Singhal in the supervision of Tirumala JEO Sri KS Sreenivasa Raju, parents with infants below five years had darshan of Lord Venkateswara on Wednesday through Supatham Entry Point.

Usually parents with infants below one year of age will be allowed for darshan. But following the repeated requests by multiple pilgrims during a recent survey conducted by TTD, parents with children below five years of age were allowed for darshan on Wednesday from 9am to 1:30pm.

In this category of pilgrims 327 tokens were issued between 9am and 1:30pm while on total 627 had darshan of Lord Venkateswara which includes parents with children below five years of age. The parents have expressed immense satisfaction with the decision of TTD to allow children up to five years along with their parents for darshan through Supatham during lean season. Similar darshan will be allotted to this category of pilgrims during next week on July 26 in the same time period.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సుపథం ద్వారా ఐదేళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం

తిరుమల, 2017 జూలై 19: తిరుమలలో బుధవారం సుపథం ప్రవేశమార్గం గుండా ఐదేళ్లలోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పించారు. సుపథం మార్గం ద్వారా ఒక సంవత్సరంలోపు వయసున్న చంటిపిల్లలు, వారి తల్లిదండ్రులను దర్శనానికి అనుమతిస్తున్న విషయం విదితమే. అయితే, ఐదేళ్ల వయసు వరకు గల పిల్లలను, వారి తల్లిదండ్రులను సుపథం ద్వారా అనుమతించాలని ఇటీవల పలువురు భక్తులు కోరారు.

భక్తుల కోరిక మేరకు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జూలై 19, 26వ తేదీల్లో ఐదేళ్లలోపు పిల్లలను, వారి తల్లిదండ్రులను సుపథం ప్రవేశం ద్వారా దర్శనానికి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు మొత్తం 327 మంది పిల్లలకు టోకెన్లు జారీ చేయగా వారి తల్లిదండ్రులతో కలిసి 627 మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.