PAVITHROTSAVAMS FROM SEP 7-9 AT PITHAPURAM TEMPLE_ సెప్టెంబ‌రు 7 నుండి 9వ తేదీ వ‌ర‌కు పిఠాపురంలోని శ్రీ వేంకటేశ్వరాల‌యంలో పవిత్రోత్సవాలు

Tirupati, 3 Sep. 19: TTD is organising the Pavitrotsavams from September 7-9 at Sri Padmavathi Sametha Venkateswara Swamy Temple at Pithapuram in East Godavari District with Ankurarpanam on September 6.

The artists of cultural wings of TTD – HDPP and Annamacharya Project will perform Bhakti sangeet, bhajans and kolatas, harikatha on all three days of the event.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 7 నుండి 9వ తేదీ వ‌ర‌కు పిఠాపురంలోని శ్రీ వేంకటేశ్వరాల‌యంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, 2019 సెప్టెంబరు 03: టిటిడికి అనుబంధంగా ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురంలోని శ్రీ ప‌ద్మావ‌తి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌రాల‌యంలో సెప్టెంబరు 7 నుండి 9వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబ‌రు 6న అంకురార్పణం, ప‌విత్ర అధివాసం నిర్వ‌హిస్తారు.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వీటి నివార‌ణ‌కు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

సెప్టెంబరు 7న ప‌విత్ర ప్ర‌తిష్ఠ‌, సెప్టెంబ‌రు 8న పవిత్ర సమర్పణ, సెప్టెంబ‌రు 9న మ‌హాపూర్ణాహుతి నిర్వ‌హిస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.