TTD EO RELEASES WALL POSTERS OF SRI PAT PAVITHROTSAVAM_ శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
Tirupati, 3 Sep. 19: TTD Executive Officer, Sri Anil Kumar Singhal on Tuesday released the wall posters of the Annual Pavitrotsavams of Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor commencing from September 12-14.
Speaking after the event at the TTDs administrative building, the EO said all arrangements were made for the holy event to facilitate the devotees.
The TTD has cancelled all arjita sevas and break darshan in the temple on the occasion of Koil Alwar Thirumanjanam, Ankurarpanam and Pavitrotsavam from September 10 onwards.
DyEO Smt Jhansi Rani, Agama advisor Sri Srinivasacharyulu, AEO Subramanyam participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
తిరుపతి, 2019 సెప్టెంబరు 03: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 12 నుంచి 14వ తేదీ వరకు జరుగనున్న వార్షిక పవిత్రోత్సవాల గోడపత్రికలను మంగళవారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
పవిత్రోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబరు 10న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబరు 11న సాయంత్రం 6 గంటలకు విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసితెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులోభాగంగా సెప్టెంబరు 12న పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 13న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 14న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750/- చెల్లించి గృహస్తులు (ఒకరికి మూడు రోజులపాటు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.
ఆర్జితసేవలు రద్దు
పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 10న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని పురస్కరించుకుని కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 11న అంకురార్పణం సందర్భంగా కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. సెప్టెంబరు 12న గురువారం తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 13న శుక్రవారం అభిషేకానంతర దర్శనం, ఉదయం బ్రేక్ దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 14న శనివారం ఉదయం బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను టిటిడి రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.