PAVITRA GARLANDS ADORNED TO DEITIES _ శ్రీవారి ఆలయంలో వైభవంగా పవిత్రాల సమర్పణ
Tirumala, 22 August 2018: On the second day of Annual Pavitrotsavams, the sacred garlands were decorated to deities on Wednesday.
Pavitrotsavam is a well prescribed ritual as “Trayahnika Deeksha”, where the archaka prays for forgiveness for all lapses– done either consciously or otherwise– in the daily worship of the Lord. This ritual is performed towards the rectification of mistakes. Commences on the auspicious Sravana Sukla Ekadasi and concludes on Trayodasi.
On the morning of the second day, on Dwadasi, after performing Snapana Tirumanjanam to the utsava murthies, Pavitra Maladharana programme was performed which is also called Pavitra Pratishtha. All the deities were decorated with colourful garlands made of sacred threads.
TTD EO Sri Anil Kumar Singhal, JEO Sri KS Sreenivasa Raju and other temple staffs were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి ఆలయంలో వైభవంగా పవిత్రాల సమర్పణ
ఆగస్టు 22, తిరుమల, 2018; తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న సాలకట్ల పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం వైభవంగా పవిత్ర సమర్పణ జరిగింది.
ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం పవిత్రాలను వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవమూర్తులకు, ఆలయంలోని ఇతర పరివార దేవతలకు, ఆనందనిలయ విమానానికి, ధ్వజస్తంభానికి, శ్రీభూవరాహస్వామి వారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాల సమర్పణ కార్యక్రమం నిర్వహించారు.
కాగా, చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు.
సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు నిర్వహిస్తారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. పవిత్రోత్సవాల కారణంగా సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవలు రద్దయ్యాయి. గురువారం రాత్రి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.