SRINIVASA KALYANAMS IN SEPTEMBER _ సెప్టెంబరులో కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు

Tirupati, 22 August 2018: As a part of the promotion of Hindu Sanatana Dharma Prachara, the celestial wedding of the deities will be conducted at various places in the districts of Kurnool and Chittoor in the month of September by the Srinivasa Kalyanam and Sri Venkateswara Vaibhavotsavam projects of TTD.

In Kurnool Dist ;
The celestial ceremony will take place at Sri Sita Rama Swamy temple premises in Kolimigundla Mandal on September 5,
Sri Gangammathalli temple premises in Bethamcherla on September 6,
Sri Sri Maremma Sankulamma temple in Benaganpalli on September 7,
Sri Raghavendraswamy mutt premises in Mantralayam on September 8,
Sri Ramulavari temple premises of Kothapalli mandal on September 9
Sri Maremma and Sri Sant Sevalal temple or Oravakally on September 10.

In Chittoor Dist ;

Government Elementary School at Chintaparthi of Vayalpadu on September 25, Basinikonda of Madanappalle on September 26, in Punganu on September 27, Chowdepalle on September 28 and in Ramachandrapuram on September 29.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబరులో కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు

ఆగస్టు 22, తిరుపతి, 2018 ; టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో సెప్టెంబరు నెలలో కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.

కర్నూలులో…

– సెప్టెంబరు 5వ తేదీన కొలిమిగుండ్ల మండలం బెలూం సింగవరం గ్రామంలోని శ్రీసీతారామస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– సెప్టెంబరు 6న బేతంచర్ల మండలం సీతారామపురం గ్రామంలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– సెప్టెంబరు 7న బనగానపల్లి మండలం చెరువుపల్లి గ్రామంలో శ్రీ మారెమ్మ సుంకులమ్మ ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– సెప్టెంబరు 8న మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– సెప్టెంబరు 9న కొత్తపల్లి మండలం కొత్తపల్లిగూడెం గ్రామంలోని శ్రీ రాములవారి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– సెప్టెంబరు 10న ఓర్వకల్లు మండలం గుమితం తాండా గ్రామంలోని శ్రీ మారెమ్మ, శ్రీ సంత్‌ సేవాలాల్‌ ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

చిత్తూరులో…

– సెప్టెంబరు 25వ తేదీన వాయల్పాడు మండలం చింతపర్తి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పక్కన గల మైదానంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– సెప్టెంబరు 26న మదనపల్లి మండలం బసినికొండ గ్రామంలోని పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– సెప్టెంబరు 27న పుంగనూరు మండలం ఆరంట్లపల్లి గ్రామంలోని శ్రీ రామాలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– సెప్టెంబరు 28న చౌడేపల్లి మండలం శ్రీ కొండయ్యగారిపల్లి గ్రామంలోని శ్రీ గంగమ్మ ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– సెప్టెంబరు 29న రామచంద్రాపురం మండలం రామాపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.