PAVITRA SAMARPANA IN SRI KRT_ శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

Tirupati, 29 Jul. 19: On second Day of the ongoing Annual Pavitrotsavam at the TTD local temple of Sri Kodandarama Swamy Temple, the holy ritual of Pavitra samarpana was performed with religious fervour after morning daily practices.

The utsava idols of Sri Sitarama and Lakshmana were brought to yagashala where the rituals of Of snapana thirumanjanam were performed and Pavitras submitted to all deities and other holy places like Homa Kundam, dwajastambham etc.

Later in the evening after thiru Veedi utsavam sattumora and other rituals were performed to utsava idols.

DyEO Smt VR Shanti, AEO Sri S Thirumalaiah, Superintendent Sri Ramesh, Temple Inspector Sri Ramesh and others participated.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

జూలై 29, తిరుపతి, 2019: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, అగ్ని ప్రణణయం, కుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, బలిమూర్తులకు, విష్వక్సేనులవారికి, ద్వారపాలకులకు, భాష్యకార్లకు, గరుడాళ్వార్‌కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, ఆలయం ఎదురుగా గల ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు.

సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం అనంతరం భాష్యకార్ల గుడి వద్ద యిహల్‌ శాత్తుమొర నిర్వహిస్తారు. రాత్రి ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపడతారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి విఆర్‌.శాంతి, ఏఈవో శ్రీఎస్‌.తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.