PAVITROTSAVAM AT SRIVARI TEMPLE FROM AUG 11-13_ ఆగస్టు 11 నుంచి 13వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

Tirumala, 29 Jul. 19: The auspicious ritual of Pavitrotsavam will be performed at the Srivari temple from August 11-13th with Ankurarpanam on August 10.

The Agama ritual is aimed to enhance the divinity and also to ward off bad impact of lapses, if any, during year long conduction of temple rituals, festivals etc., say Agama exponents of
the Srivari temple. The centuries old practice was revived in 1962 and is performed in rigid traditions as a three-day colourful event.

On all three days snapana thirumanjanam will be performed to the utsava idols of Sri Malayappaswamy and his consorts in tne morning.

In the evenings the richly decorated and bejewelled utsava idols will be paraded on the mada streets. While Pavitra Prathishta is conducted on August 11, Pavitra samarpana on August 12, and Purnahuti are performed on August 13.

TTD has cancelled scheduled Arjita sevas on all three days including Vasantotsavam Sahasra Deepalankara sevas on August 10, Visesha puja, Asta Dala pada padmaradhana, Kalyanotsavam, unjal seva, arjita Brahmotsavams, Vasantotsavam and Sahasra Dipalankara sevas on August 11-13.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగస్టు 11 నుంచి 13వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుమల, 2019 జూలై 29: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 11 నుంచి 13వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 10న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.

అనంతరంసాయంత్రం 6.00 నుంచి రాత్రి 7.00 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 11న పవిత్రాల ప్రతిష్ట, ఆగస్టు 12న పవిత్ర సమర్పణ, ఆగస్టు 13న పూర్ణాహుతి నిర్వహిస్తారు.

ఆర్జితసేవలు రద్దు :

పవిత్రోత్సవాల నేపథ్యంలో ఆగస్టు 10న వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి. ఆగస్టు 11 నుండి 13వ తేదీ వరకు విశేష పూజ, అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకారసేవలు రద్దయ్యాయి.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.