PAVITRAMALAS OFFERED TO GODDESS PADMAVATHI ON SECOND DAY_ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా పవిత్ర సమర్పణ

Tiruchanur, 5 September 2017: As a part of the second day of the ongoing three day Pavitrotsavams in Sri Padmavathi Temple at Tiruchanoor on Tuesday, the sacred Pavitra Malas have been offered to deities in the temple as per temple tradition.

The colour threads oven out of special silk material were decorated to Dhwajasthambham, presiding deity, processional deities and other deities of the sub-temples located in temple premises.

The Pavitraropana took place in a ceremonious manner amidst the chanting of Vedic mantras by temple priests as per the tenets of Pancharatra Agamavidhi.

Special Grade DyEO Sri Munirathnam Reddy, AEO Sri Radhakrishna, Suptd Sri Ravi and other temple staff were also present.


ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా పవిత్ర సమర్పణ

సెప్టెంబర్‌ 05, తిరుపతి, 201: తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం పవిత్ర సమర్పణ వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన చేపట్టారు. ఆ తరువాత పవిత్ర సమర్పణ, నివేదన, యాగశాలలో తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. ఈ కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ రద్దయ్యాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, ఏఈవో శ్రీరాధాకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

సెప్టెంబరు 6న చక్రస్నానం :

పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు స్నపనతిరుమంజనం, చక్రస్నానం జరుగనుంది. ఉదయం మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారు, శ్రీ సుందరరాజ స్వామివారు, శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.