TEACHERS SHOULD IMPART OF ETHICAL VALUES AMONG STUDENTS-TTD EO_ విద్యార్థుల్లో నైతిక విలువల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
Tirupati, 5 September 2017: “It is because of my teachers I am in this position here today. Today is a memorable day in my life as I have assumed charges as an IAS officer on September 5”, asserted TTD EO Sri Anil Kumar Singhal.
The TTD EO took part in the Gurupujotsavam organised by Education Wing of TTD under the aegis of SV Arts College in Mahati Auditorium in Tirupati on Tuesday.
Speaking on this occasion, the EO said, “the teachers should impart ethical values among the students along with academic knowledge. The students should be given training spiritual, dharmic, personality development, leadership qualities also and should make them as responsible citizens of the country”,he added.
The EO also said, to enhance the standards of education in TTD-run institutions, we have come out with IT related teaching programme perspective and also to develop communication skills in spoken English.
Tirupati JEO Sri P Bhaskar said, Dr Sarvepalle Radhakrishnan stood as role model to the teachers’ fraternity. “His literary works have global impact among the intellectual section”, he said.
Special Officer Sri N Muktheswara Rao said, the simplicity, respect towards elders, tradition and culture made Dr Radhakrishnan from an ordinary teacher to decorate the most coveted post of first citizen of India.
TTD EO and JEO facilitated 18 retired teachers belonging to various TTD institutions for their impeccable services.
Devasthanams Educational Officer Sri Ramachandra was also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
విద్యార్థుల్లో నైతిక విలువల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
తిరుపతి, 2017 సెప్టెంబరు 05:టిటిడి విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు నాణ్యమైన బోధనా ప్రమాణాలు పాటించి, విద్యార్థులలో నైతిక విలువలకు మరింత కృషి చేయాలని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీఅనిల్‌కుమార్ సింఘాల్ పిలుపునిచ్చారు. సెప్టెంబరు 5న గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని టిటిడి విద్యా విభాగం ఆధ్వర్యంలో ఎస్వీ ఆర్ట్స్ కళాశాల నిర్వహణలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో మంగళవారం గురుపూజోత్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈవో మాట్లాడుతూ విద్యార్థులలో భక్తి భావాన్ని, నైతిక విలువలను పెంచేలా ఉపాధ్యాయులు బోధించాలని సూచించారు. విద్యార్థులకు ఆధ్యాత్మిక విలువలు, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ నిర్మాణం, వ్యక్తిత్వ వికాసం ఉండేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. టిటిడి విద్యాసంస్థలలో విద్యనభ్యసించే విద్యార్థులు నైతిక విలువలు, వ్యక్తిత్వం, నైపుణ్యం అలవర్చుకుని జాతి నిర్మాణానికి కృషి చేయాలన్నారు. సమాజంలో ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు విద్యార్థులు ప్రతిభను పెంపొందించుకుని జీవితంలో ఉన్నత స్థానాలలో స్థిరపడాలని కోరారు.
ఉపాధ్యాయులకు సమాజంలో గౌరవభావం ఉందని, దీన్ని మరింత పెంచాలని ఈవో కోరారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఆత్మీయ అనుబంధం ఉండాలన్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే టిటిడి ఈవో స్థాయికి వచ్చానని, సెప్టెంబరు 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంరోజు తాను ఐఏఎస్‌గా బాధ్యతలు చేపట్టానని గుర్తు చేసుకున్నారు. టిటిడి విద్యాసంస్థలలో విద్యార్థులకు నైపుణ్యం పెంచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, అందులో భాగంగా ఆంగ్లం, సాంకేతిక నైపుణ్యం పెంపొందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
అసంతరం తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులను భావిభారత పౌరులుగా తయారు చేయడంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయులందరికీ ఆదర్శనీయులన్నారు. రాధాకృష్ణన్ తన రచనలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులను ప్రభావితం చేసినట్టు తెలిపారు. ఉపాధ్యాయులు లోతుగా అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు నూతన పద్ధతుల్లో విద్యార్థులకు బోధన అందించాలని సూచించారు. టిటిడి విద్యాసంస్థలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను టిటిడి కల్పిస్తోందన్నారు.
టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్.ముక్తేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు విజ్ఞానంతో పాటు, భారతీయ సంస్కృతి, సాంప్రదాయ విలువలు, ఉపనిషత్తుల సారాంశాన్ని తెలియజేయాలన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ సామాన్య వ్యక్తి నుండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అనంతరం టిటిడి విద్యాసంస్థలకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు 18 మందిని ఈవో, జెఈవోలు ఘనంగా సన్మానించారు. ఆ తరువాత విద్యార్థులకు ప్రవర్తన, భక్తి ఆలోచనపై బెంగళూరుకు చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిపుణులు శ్రీ గణేష్ రాధాకృష్ణ ఉపన్యసించారు. విద్యార్థులకు బోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనే అంశంపై హైదరాబాద్‌కు చెందిన డా|| వీరేంద్ర ఉపన్యసించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి విద్యాశాఖాధికారి శ్రీ రామచంద్ర, ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ డా|| వి.పద్మావతి, టిటిడి విద్యాసంస్థల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది