PAVITROTSAVA ANKURARPANA HELD IN PAT_ ఘనంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలకు అంకురార్పణ
Tiruchanoor, 22 September 2018: The Ankurarpanam for annual three day Pavitrotsavams was held in Sri Padmavathi Ammavari Temple in Tiruchanoor on Saturday evening.
A series of religious events including Viswaksena Aradhana, Punyahavachanam, Rakshabandhanam, Mritsangrahanam, Senadhipathi Utsavam were held before Beejavapanam which is also known as Ankurarpanam.
To waive off the sins committed either knowingly or unknowingly by pilgrims, religious staff and employees, the Pavitrotsavams are observed as Sin free festival every year for three days.
On first day on September 23, Pavitra Pratista, second day Pavitra Samarpana and on last day Pavitra Purnahuti will be performed.
The Grihastas who are willing to take part in this festival, will have to pay Rs.750 on which two persons will be allowed per ticket. They will be presented with two laddus and two vadas.
Spl Gr DyEO Sri Munirathnam Reddy, AEO Sri Subramanyam, Suptd Smt Malleswari, Temple Staff and devotees took part.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ఘనంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలకు అంకురార్పణ
సెప్టెంబరు 22, తిరుపతి, 2018: తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలకు శనివారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ, పవిత్ర అధివశం నిర్వహించారు.
ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలిసీ తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సెప్టెంబరు 23 నుండి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబరు 23వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 24న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 25న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750/- చెల్లించి గృహస్తులు (ఒకరికి మూడు రోజులపాటు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.
ఆర్జితసేవలు రద్దు :
సెప్టెంబరు 23వ తేదీ ఆదివారం పవిత్రోత్సవాల్లో మొదటిరోజు కల్యాణోత్సవం, సహస్రదీపాలంకారసేవ, , సెప్టెంబరు 24న రెండో రోజు సోమవారం కల్యాణోత్సవం, సహస్రదీపాలంకారసేవ, అష్టదళపాదపద్మారాధన, సెప్టెంబరు 25న పవిత్రోత్సవాల్లో చివరిరోజు మంగళవారం కల్యాణోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టిటిడి రద్దు చేసింది. అలాగే సెప్టెంబరు 24, 25వ తేదీల్లో ఉదయం, సాయంత్రం బ్రేక్ దర్శనాలు ఉండవని టిటిడి తెలియజేసింది.
ఈ కార్యక్రమంలో టిటిడి ప్రత్యేక శ్రేణి డెప్యూటి ఈఓ శ్రీ మునిరత్నంరెడ్డి, ఎఇఓ శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీమతి మల్లీశ్వరి,టెంపుల్ ఇన్స్ పెక్టర్ శ్రీ గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.