SRI GT PAVITROTSAVAMS ENDS WITH PURNAHUTI_ పూర్ణాహుతితో ముగిసిన శ్రీ‌ గోవిందరాజస్వామివారి ప‌విత్రోత్స‌వాలు

Tirupati, 22 September 2018: The annual Pavitrotsavams concluded on a grand note in Sri Govinda Raja Swamy temple with Pavitra Purnahuti on Saturday.

After the daily routine, special pujas were performed in Yagashala.

Later Pavitra Purnahuti was performed which marked the ceremonious conclusion of the annual event.

The Grihastas have to pay Rs.500 per ticket on which two persons will be allowed to take part in this religious fete.

Temple DyEO Smt Varalakshmi, AEO Sri Uday Bhasakar Reddy, Suptd Sri Suresh, Temple inspector Sri Prasanth and others took part.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ‌ గోవిందరాజస్వామివారి ప‌విత్రోత్స‌వాలు

సెప్టెంబరు 22, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆల‌యంలో శనివారం రాత్రి పూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగియ‌నున్నాయి.

ఈ సందర్భంగా ఉదయం కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఆ త‌రువాత‌ సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం చేపట్టారు. ఆ త‌రువాత రాత్రి యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతి, ప్ర‌బంధ శాత్తుమొర‌, వేద శాత్తుమొర నిర్వ‌హిస్తారు. అనంత‌రం ఉత్స‌వ‌మూర్తులు కుంభం విమాన‌ప్ర‌ద‌క్షిణంగా స‌న్నిధికి వేంచేపు చేస్తారు.

ఈ కార్యక్ర‌మంలో స్థానిక ఆల‌యాల డెప్యూటి ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, ఏఈవో శ్రీ ఉద‌య్ భాస్క‌ర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ జ్ఞానప్రకాష్‌, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఎ.పి. శ్రీ‌నివాస దీక్షితులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.