PAVITROTSAVAM CONCLUDES AT SRI GT _ ఘనంగాశ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు

Tirupati,27 September 2023: The three-day-long annual Pavitrotsavams concluded with the grand Purnahuti fete in Sri Govindaraja Swamy temple on Wednesday.

Earlier in the morning after Nitya Kainkaryas the utsava idols were brought to Yagashala for Snapana Tirumanjanam.

Temple Dyeo Smt Shanti, AEO Sri Munikrishna Reddy, temple chief archaka Sri Srinivasa Dikshitulu superintendent Sri Mohan Rao, Temple inspector Sri Dhananjay were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

ఘనంగాశ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు
– సాయంత్రం పూర్ణాహుతి

తిరుపతి, 2023 సెప్టెంబరు 27: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల నుండి నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు బుధవారం సాయంత్రం పూర్ణాహుతితో ఘనంగా ముగియనున్నాయి.

ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు.

సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. రాత్రి 7.30 నుండి 9.30 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతి, ఏఈవో శ్రీ మునిక్రిష్ణారెడ్డి, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ ఎపి.శ్రీ‌నివాస దీక్షితులు, సూప‌రింటెండెంట్ శ్రీ మోహ‌న్‌రావు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ధ‌నంజ‌య‌ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.