WII TEAM INSPECTS ALIPIRI FOOTPATH _ అలిపిరి కాలిబాట మార్గం తనిఖీ చేసిన డబ్ల్యూఐఐ బృందం

Tirumala, 28 September 2023: A three-member expert team from the Wildlife Institute of India(WII) inspected the Alipiri footpath route on Wednesday evening.

 

During their field inspection from Alipiri to NS temple on foot they inspected both spots of Animal attack on Koushik and Lakshitha, the areas where six Leopards trapped.

 

They also studied the terrain and footpath details and also possibilities for permanent measures such as fencing, under passes and over passes etc. and also verified the short-term measures taken by TTD and the Forest Department of AP and expressed satisfaction.

 

Dr Ramesh, Scientist from WII, Dehradun along with two other team members Dr Ashutosh Singh, and Mr Prashant Mahajan informed that there is a possibility to take up fencing along with under and over passes for animals passage in the Alipiri foot path. CF Sri Nageswara Rao, Deputy CF of TTD Sri Srinivasulu were also present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

అలిపిరి కాలిబాట మార్గం తనిఖీ చేసిన డబ్ల్యూఐఐ బృందం

తిరుమల, 28 సెప్టెంబర్ 2023: వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఐఐ) డెహ్రాడూన్ కి చెందిన ముగ్గురు సభ్యుల నిపుణుల బృందం బుధవారం సాయంత్రం అలిపిరి కాలిబాట మార్గాన్ని పరిశీలించింది.

కాలినడకన అలిపిరి నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు వారు చేసిన క్షేత్ర పరిశీలనలో, కౌశిక్ మరియు లక్షితపై చిరుత దాడి జరిగిన రెండు ప్రదేశాలను, ఆరు చిరుతలను చెర పట్టిన ప్రాంతాలను వారు పరిశీలించారు.

ఫెన్సింగ్, అండర్ పాస్‌లు మరియు ఓవర్ పాస్‌లు మొదలైన శాశ్వత చర్యలకు ఉన్న అవకాశాలను కూడా అధ్యయనం చేశారు మరియు TTD మరియు AP అటవీ శాఖ తీసుకున్న స్వల్పకాలిక చర్యల పట్ల కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు.

కాలినడకన అలిపిరి నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు వారు చేసిన క్షేత్ర పరిశీలనలో, కౌశిక్ మరియు లక్షితపై చిరుత దాడి జరిగిన రెండు ప్రదేశాలను, ఆరు చిరుతలను చర పట్టిన ప్రాంతాలను వారు పరిశీలించారు.

ఫెన్సింగ్, అండర్ పాస్‌లు మరియు ఓవర్ పాస్‌లు మొదలైన శాశ్వత చర్యలకు ఉన్న అవకాశాలను కూడా అధ్యయనం చేశారు. మరియు TTD మరియు AP అటవీ శాఖ తీసుకున్న స్వల్పకాలిక చర్యల పట్ల కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు.

అనంతరం డబ్ల్యుఐఐ శాస్త్రవేత్త డాక్టర్ కే రమేష్ తో పాటు మరో ఇద్దరు బృందం సభ్యులు డాక్టర్. అశుతోష్ సింగ్, మరియు శ్రీ. ప్రశాంత్ మహాజన్, మాట్లాడుతూ అలిపిరి కాలిబాటలో జంతువులు వెళ్లేందుకు అండర్, ఓవర్ పాస్‌లతో పాటు ఫెన్సింగ్‌ను చేపట్టే అవకాశం ఉందని తెలిపారు.

సీఎఫ్‌ శ్రీ నాగేశ్వరరావు, టీటీడీ డిప్యూటీ సీఎఫ్‌ శ్రీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది