PAVITROTSAVAM CONCLUDES AT TIRUCHANOOR _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
Tiruchanoor, 2 Sep. 20: The three day annual Pavithrotsavam concluded on Wednesday with Maha Purnahuti and Pavitra Visarjana rituals at Sri Padmavati Ammavari temple at Tiruchanoor in which TTD EO Sri Anil Kumar Singhal participated.
On the last day Shanti Homam, Kumbha Prokshana and Nivedana were also observed.
In the afternoon, traditional Snapana Tirumanjanam was performed for the utsava idols of Sri Padmavati Ammavaru and Sri Sudarshana Chaktrattalwar.
Thereafter, Chakrasnanam was performed to the utsava idol of Sri Sudarshana
Chakrathalvar in a silver vessel (Gangalam) at Sri Krishna Mukha Mandapam in view of COVID-19 restrictions.
In the night, rituals including Raksha Bandhanam, Rutwick Sanmanam were held to herald the conclusion of the Pavitrotsavam fete.
Temple Dyeo Smt Jhansi Rani, AEO Sri Subramaniam and others participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
తిరుచానూరు, 2020 సెప్టెంబరు 02: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు బుధవారం మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జనంతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.
ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11.05 నుండి మధ్యాహ్నం 12.30 గంటలకు శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, పవిత్ర విసర్జనం, కుంభప్రోక్షణ, నివేదన నిర్వహించి తీర్థప్రసాద వినియోగం చేశారు.
చక్రస్నానం :
మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారితో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పన్నీరు, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో పవిత్రజలాన్ని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శన చక్రాన్ని ముంచి చక్రస్నానం చేశారు.
కాగా రాత్రి రక్షాబంధనం, ఆచార్య, ఋత్విక్ సన్మానంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీమతి మల్లీశ్వరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రాజేష్ కన్నా, శ్రీ పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.