PAVITROTSAVAM TICKETS IN ONLINE _ ఆన్‌లైన్‌లో శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు
TIRUMALA, 29 JULY 2022: TTD will release the annual Pavitrotsavam tickets in on-line on August 1 at 10am.
A quota of 600 tickets each pricing at Rs. 2500 per person will be available in on-line.
The annual fete will be observed between August 8-10 in Tirumala temple.
The ticket holders will be allowed to participate in the seva (Snapana Tirumanjanam) on all the three days and also for Purnahuti on the last day.
They have to report at Vaikuntam 1 at 7am and should carry individual ticket and original photo ID along with them. Traditional dress is mandatory.
For more details please visit www.tirumala.org or www.tirupatibalaji.gov.in
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆన్‌లైన్‌లో శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు
తిరుమల, 29 జులై 2022: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 8 నుండి 10వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల్లో భక్తులు పాల్గొనేందుకు వీలుగా ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనుంది.
మొత్తం 600 టికెట్లను ఆన్‌లైన్ ద్వారా జారీ చేస్తారు. రూ.2500/- చెల్లించి భక్తులు టికెట్ బుక్ చేసుకోవచ్చు. టికెట్లు పొందిన భక్తులు పవిత్రోత్సవాలు జరిగే మూడు రోజులు స్నపనతిరుమంజనంలో, చివరిరోజు పూర్ణాహుతిలో పాల్గొనవచ్చు. పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో ఉదయం 7 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 వద్దకు చేరుకోవాలి. టికెట్‌తోపాటు ఏదైనా ఒక ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు చూపాలి.
మరిన్ని వివరాలకు www.tirumala.org లేదా www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్లను సందర్శించగలరు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.