PAVITROTSAVAMS COMMENCES _ శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
TIRUPATI, 10 JULY 2022: The annual Pavitrotsavams at Sri Kapileswara Swamy temple in Tirupati commenced on a grand religious note in Tirupati.
Earlier Snapana Tirumanjanam was performed to Sri Kapileswara, Sri Kamakshi, Sri Vighneswara, Sri Subramanya, Sri Chandikeswara utsava murties.
Later in the evening Prana Pratistha was performed.
Deputy EO Sri Devendrababu, AEO Srinivas, Superintendent Sri Bhupati and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2022 జులై 10: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా ఉదయం 9 నుండి 10 గంటల వరకు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, పసుపు, గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా స్నపనతిరుమంజనం చేపట్టారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, సూపరింటెండెంట్లు శ్రీ భూపతి, శ్రీ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.