PAVITROTSAVAMS CONCLUDE IN SRI PAT_ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

Tiruchanoor, 6 September 2017: The three day annual pavitrotsavams concluded on a ceremonial note in Tiruchanoor on Wednesday evening.

After snapana tirumanjanam, the sudarshana chakrattalwar was rendered chakrasnanam in the Padma Pushkarini.

On the final day Pavitra Visarjanam, Shanti Homa, Kumbha Prokshanam, Nivedana and Maha Purnahuti were performed.

TTD EO Sri AK Singhal, JEO Sri P Bhaskar, CVSO Sri Ake Ravikrishna, Spl Gr DyEO Sri Munirathanam Reddy, AEO Sri Radhakrishna, Suptd Sri Ravi and other officers were also present.


ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుపతి, 2017 సెప్టెంబరు 06: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మూడోరోజు బుధవారం మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జనంతో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, పవిత్ర విసర్జనం, కుంభప్రోక్షణ, నివేదన నిర్వహించి తీర్థప్రసాద వినియోగం చేశారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడుతూ గడిచిన సంవత్సర కాలంలో అమ్మవారి ఆలయంలో భక్తులవల్ల గానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక జరిగిన దోషాలకు పరిహారంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అర్చకులు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ, పవిత్ర సమర్పణ, పవిత్ర విసర్జనం నిర్వహించినట్లు తెలిపారు. భక్తులందరిపైనా అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఈవో ఆకాంక్షించారు.

వైభవంగా చక్రస్నానం :

మధ్యాహ్నం 3.00 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, కొబ్బరినీళ్ళతో, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారి పద్మపుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా జరిగింది.

సాయంత్రం 6.00 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారు, శ్రీ సుందరరాజ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగింపు నిర్వహించనున్నారు. రాత్రి రక్షాబంధనం, ఆచార్య, ఋత్విక్‌ సన్మానంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ దంపతులు, స్థానిక ఆలయాల ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈఓ శ్రీమునిరత్నంరెడ్డి, ఏఈఓ శ్రీ రాధాకృష్ణ, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.