DEVELOP PARKING PLACE IN TIRUCHANOOR-TTD EO_ తిరుచానూరులో భక్తుల కోసం పార్కింగ్‌ స్థలాలను గుర్తించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tiruchanoor, 6 September 2017: The TTD EO Sri Anil Kumar Singhal instructed the officials concerned to develop the parking place in Tiruchanoor and see that there is no congestion of traffic in the pilgrim centre.

The TTD administrative chief along with Tirupati JEO Sri P Bhaskar and CVSO Sri A Ravikrishna inspected the parking areas and other developmental activities in Tiruchanoor on Wednesday. As a part of it, the EO asked the officials to verify the possibilities of extending road near Ghantashala statue and also to divert buses from the adjacent street. He also inspected the mada streets, Annaprasada Bhavan.

Later the JEO explained to the EO about the ongoing developmental works by showing the developmental plan. The EO instructed the engineering wing to take necessary measures for parking slots, road diversions etc.

Tirupati Urban SP Sri Abhishek Mohanty, Sub-Collector Sri Nishant Kumar, Panchayat Secretary Sri Janardhan Reddy, CE Sri Chandrasekhar Reddy, SplGr DyEO Sri Munirathnam Reddy, SE Sri Sriramulu were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

తిరుచానూరులో భక్తుల కోసం పార్కింగ్‌ స్థలాలను గుర్తించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

సెప్టెంబర్‌ 06, తిరుపతి, 2017 : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనాల పార్కింగ్‌ స్థలాలను గుర్తించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, అర్బన్‌ ఎస్‌పి శ్రీ అభిషేక్‌ మహంతి, సబ్‌కలెక్టర్‌ శ్రీ నిశాంత్‌కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డితో కలిసి బుధవారం ఈవో ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

ఘంటసాల విగ్రహం సర్కిల్‌ వద్ద రోడ్డు విస్తరణ, బస్సులను పక్కవీధి ద్వారా మళ్లించేందుకు గల సాధ్యాసాధ్యాలను ఈవో పరిశీలించారు. ఆలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆ తరువాత తోళప్పగార్డెన్స్‌లో అన్నదానం భవన నిర్మాణాన్ని, మాడ వీధులను పరిశీలించారు. ఆలయ పరిపాలన భవనం వద్ద పార్కింగ్‌, రోడ్డు డైవర్షన్‌ కోసం తగిన చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. అనంతరం తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికలను ఈవోకు వివరించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, ఎస్‌ఇ-4 శ్రీ రాములు, తిరుచానూరు పంచాయతీ కార్యదర్శి శ్రీ జనార్ధన్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.