PAVITROTSAVAMS CONCLUDES _ శ్రీ కపిలేశ్వరాలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు
TIRUPATI, 23 JULY 2021: The annual Pavitrotsavams concluded with Maha Purnahuti in Sri Kapileswara Swamy temple at Tirupati on Friday.
Due to Covid restrictions, the festival was observed in Ekantam.
After Abhishekam to the presiding deities, Maha Purnahuti and Pavitra Samarpana were performed. Later in the evening, Asthanam will be performed to Panchamurthis.
Temple DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati, Temple Inspectors Sri Reddy Sekhar, Sri Srinivasa Naik, Archakas were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు
తిరుపతి, 2021 జూలై 23: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం మూలవర్లకు అభిషేకం, మహాపూర్ణాహుతి, పవిత్ర సమర్పణ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీపనైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం పంచ మూర్తులకు ఆస్థానం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖర్, శ్రీ శ్రీనివాస నాయక్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.