PAVITROTSAVAMS IN HRISHIKESH TEMPLE FROM OCTOBER 20 TO 22_ రిషికేష్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Tirupati, 19 October 2018: Three day Pavitrotsavams in Sri Venkateswara Swamy temple at Hrishikesh will be observed between October 20 to 22.

While the Ankurarpana for this three day utsavam was observed on Friday evening.

On first day, Pavitra Pratishta, second day Pavitra Samarpana and on final day Pavitra Purnahuti will be observed.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రిషికేష్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి, 2018 అక్టోబరు 19: టిటిడి పరిధిలోని రిషికేష్‌ ఆంధ్ర ఆశ్రమంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 20 నుండి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు అంకురార్పణం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 20న సాయంత్రం 6.00 గంటలకు పవిత్ర ప్రతిష్ట, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండో రోజు అక్టోబరు 21న ఉదయం 8.00 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, పవిత్ర సమర్పణ, యాగశాల వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6.00 గంటలకు వీధి ఉత్సవం జరుగనున్నాయి. చివరిరోజు అక్టోబరు 22న ఉదయం 8.00 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, సాయంత్రం వీధి ఉత్సవం, రాత్రి మహాపూర్ణాహుతితో ముగియనున్నాయి. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.