PAVITROTSAVAMS IN KT _ జులై 21 నుండి 23వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు
TIRUPATI, 11 JULY 2021: The annual three-day Pavithrotsavams in Sri Kapileswara Swamy Temple at Tirupati will be observed from July 21 to 23 in Ekantam due to Covid restrictions.
On the first day Pavitra Pratista, the second-day Pavitra Samarpanam and on the last day Pavitra Purnahuti will be observed.
This utsava is penitential as well as propitiatory and its main objective is to get rid of the evil that might have been caused due to omissions and commissions in the performance of various rituals throughout the year. The festival is also known as Dosha Nivaarana Utsava.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జులై 21 నుండి 23వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు
తిరుపతి, 2021 జులై 11: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జులై 21 నుండి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం జులై 20న సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా జులై 21న మొదటిరోజు ఉదయం ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, సాయంత్రం కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహిస్తారు. జులై 22న రెండో రోజు ఉదయం గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలపూజ, హోమం చేపడతారు. జులై 23న ఉదయం మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లకు ఏకాంతంగా ఆస్థానం నిర్వహిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.