PAVITROTSAVAMS IN TTD RAMA TEMPLES

Tirupati, 10 Oct. 19:The annual Pavitrotsavams in the TTD sub-temples dedicated to Lord Sri Rama will be observed in a grand manner in the month of October. 

In Valmikipuram Pattabhi Rama Swamy temple, the three day annual Pavitrotsavams will be observed from October 12-14 with Ankurarpanam on October 11.

While in Sri Kodanda Ramalayam at Chandragiri, the three day annual fest will be observed from October 19-21 with Ankurarpanam on October 18.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

అక్టోబరు 19 నుండి  21వ తేదీ వరకు చంద్రగిరి శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, 2019 అక్టోబరు 10: టిటిడికి అనుబంధంగా ఉన్న చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయంలో అక్టోబరు 19 నుండి 21వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. అక్టోబరు 18వ తేదీన అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 19వ తేదీన ఉదయం 8.30 నుండి 11.00 గంట‌ల వ‌ర‌కు చ‌తుష్టానార్చన, పవిత్ర ప్రతిష్ఠ, మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, సాయంత్రం 5.00 నుండి రాత్రి 8.00 గంట‌ల వ‌ర‌కు పవిత్ర హోమాలు నిర్వహిస్తారు. అక్టోబరు 20న ఉదయం 9.00 నుండి మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల వ‌ర‌కు ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, సాయంత్రం పవిత్ర హోమాలు చేస్తారు. అక్టోబరు 21న ఉద‌యం 8.00 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు పవిత్ర విసర్జన, చతుష్టాన ఉద్వాసన, కుంభప్రోక్షణ, పవిత్ర వితరణ చేపడతారు. ఉద‌యం 11.30 నుండి మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల వ‌ర‌కు మ‌హా పూర్ణాహూతి, స్న‌ప‌న తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం నిర్వ‌హించ‌నున్నారు.  గృహస్తులు(ఇద్దరు) రూ.200/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు.

 

 


అక్టోబ‌రు 11న వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్ప‌ణ‌

వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో అక్టోబరు 12 నుండి 14వ తేదీ వరకు జ‌రుగ‌నున్న పవిత్రోత్సవాలకు అక్టోబరు 11వ తేదీ శుక్ర‌వారం సాయంత్రం 5.00 నుండి 8.00 గంటల వరకు అంకురార్పణ ఘనంగా నిర్వహించ‌నున్నారు.

ఇందులో భాగంగా అక్టోబరు 12వ తేదీ ఉదయం 7.00 గంటలకు యాగశాల పూజ చతుష్టానార్చన, హోమం, పవిత్రప్రతిష్ఠ, నివేదన సాయంత్రం 5.30 గంట‌ల నుండి యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబరు 13న ఉదయం పవిత్రసమర్పణ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు,  అక్టోబరు 14న ఉదయం యాగశాల పూజ, మహాపూర్ణాహుతి, స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు. రాత్రి తిరువీధి ఉత్సవం, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, స్వామివారి తీర్ధ ప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

 

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ య‌ల్ల‌య్య‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ మోహ‌న్‌రావు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.