PAVITROTSAVAMS POSTERS OF SKVST RELEASED _ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల పోస్ట‌ర్ల ఆవిష్క‌ర‌ణ‌

Tirupati,14 October 2022: TTD JEO Sri Veerabrahmam on Friday released the posters of pavitrotsavam fete at Sri Kalyan Venkateswara temple. Srinivasa Mangapuram is slated from October 21-23, at his chambers in TTD administrative building.

Speaking on the occasion the JEO said the fete commenced with Ankurarpanam on October 20, Pavitra Pratista on October 21, Pavitra Samarpana on October 22 and Pavitra Purnahuti on October 23.

He said the festival is aimed at resolving any lapses in rituals etc by Archakas or devotees in the temple during year-long celebrations.

Special Grade DyEO Smt Varalakshmi, temple Archakas Sri Balaji Swami and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల పోస్ట‌ర్ల ఆవిష్క‌ర‌ణ‌

తిరుపతి, 2022 అక్టోబరు 14: శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల పోస్టర్లను జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 20న అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అక్టోబరు 21న పవిత్రప్రతిష్ఠ, అక్టోబరు 22న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, శ్రీ ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పణ ఉంటుందన్నారు. అక్టోబరు 23న రాత్రి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయని తెలియజేశారు.

యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయ‌న్నారు. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంద‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి స్వామి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.