PAVITROTSAVAMS POSTERS RELEASED_ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించిన జెఈవో

Tirupati, 19 August 2017: In connection with annual pavitrotsavams at Tiruchanoor, Tirupati JEO Sri P Bhaskar along with Devasthanams Law Officer Sri MV Ramana Naidu released posters in his chamber on Saturday.

Speaking on this occasion the JEO said, the three day religious fete will be from September 4-6. On first day Pavitra Pratista, second day Pavitra Samarpana and on final day purnahuti will be observed”, he added.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించిన జెఈవో

ఆగస్టు 19, తిరుపతి, 2017: తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 4 నుండి 6వ తేదీ వరకు జరుగనున్న వార్షిక పవిత్రోత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను శనివారం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలిసీ తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సెప్టెంబరు 4వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 5న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 6న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయని వివరించారు. రూ.750/- చెల్లించి గ హస్తులు (ఒకరికి మూడు రోజులపాటు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చని, 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తామని తెలిపారు.

ఆర్జితసేవలు రద్దు :

సెప్టెంబరు 3వ తేదీన అంకురార్పణం సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ రద్దయ్యాయి. సెప్టెంబరు 4వ తేదీ సోమవారం పవిత్రోత్సవాల్లో మొదటిరోజు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, అష్టదళపాదపద్మారాధన, సెప్టెంబరు 5న రెండో రోజు మంగళవారం కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 6న పవిత్రోత్సవాల్లో చివరిరోజు బుధవారం కల్యాణోత్సవం, ఆష్టోత్తర శతకలశాభిషేకం, ఊంజల్‌సేవలను టిటిడి రద్దు చేయనుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి న్యాయాధికారి శ్రీ ఎం.వి.రమణనాయుడు, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.