PEACOCK FEATHERS-BANGLES-PEARLS GARLANDS ADORN PADMAVATHI _ నెమలి ఈకల మాల, గాజుల మాల, ముత్యాల మాలలతో
నెమలి ఈకల మాల, గాజుల మాల, ముత్యాల మాలలతో
శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం
తిరుపతి, 20224 మే 23: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల్లో రెండవ రోజైన గురువారం నెమలి ఈకలు, గాజులు, ముత్యాలతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలతో స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది.
మధ్యాహ్నం 2.30 గంటలకు అమ్మవారి ఉత్సవర్లకు శుక్రవారపు తోటలో వేదమంత్రాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, కుంకుమ, చందనంలతో అభిషేకం చేశారు.
రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ గణేష్, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.