PEDDA SESHA VAHANA SEVA HELD _ పెద్దశేష వాహనసేవలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
TIRUMALA, 27 SEPTEMBER 2022: On the first day of the annual Brahmotsavam, Sri Malayappa flanked by Sridevi and Bhudevi took out a celestial ride on Pedda Sesha Vahanam to bless His devotees along the four Mada streets.
Devotees are thrilled to see their beloved deity over the seven hooded serpent carrier.
As the vahana Seva is taking place in the presence of pilgrim public after a two-year break due to Covid Pandemic, the devotees thronged in large numbers.
Temple officials were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
పెద్దశేష వాహనసేవలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
సెప్టెంబర్ 27, తిరుమల 2022: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ వైఎస్.జగన్మోహన్రెడ్డి ఈ వాహనసేవలో పాల్గొన్నారు.
ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులు శ్రీ నారాయణ స్వామి, శ్రీ సత్యనారాయణ, మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ వేణుగోపాలకృష్ణ, శ్రీమతి రోజా, ఎంపిలు శీ మిథున్ రెడ్డి, శ్రీ రెడ్డెప్ప, శ్రీ గురుమూర్తి, శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ భూమన కరుణాకరరెడ్డి, శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీ మేడా మల్లికార్జునరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ రాములు, శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ సంజీవయ్య, శ్రీ మధుసూదన్ యాదవ్, శ్రీ మారుతి ప్రసాద్, శ్రీమతి ప్రశాంతిరెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.