PEDDA SESHA VAHANA SEVA ON OCT 31 _ అక్టోబరు 31న పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప దర్శనం
Tirumala, 19 Oct 19: Pedda Sesha Vahana Seva will be observed in Tirumala on October 31 in connection with Nagulachaviti.
Usually during annual brahmotsavams, the vahana sevas commences with Pedda Sesha Vahanam.
On October 31, Sri Malayappa Swamy flanked by Srdevi and Bhudevi will take a celestial ride along four mada streets between 7pm and 9pm.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అక్టోబరు 31న పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప దర్శనం
అక్టోబరు 19, తిరుమల, 2019 ; తిరుమలలో అక్టోబరు 31వ తేదీన నాగులచవితి పర్వదినం సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి తిరుమాడ వీధులలో పెద్దశేషవాహనంపై ఊరేగుతూ భక్తులను కనువిందు చేస్తారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్యపూజలందుకుంటున్నాడు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు. అందుకే బ్రహ్మోత్సవ వాహనసేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించారు.
కాగా, నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల నాలుగు మాడ వీధులలో రాత్రి 7 నుండి 9 గంటల నడుమ శ్రీ మలయప్పస్వామివారు తమ ఉభయదేవేరులతో కలిసి పెద్దశేష వాహనంపై ఊరేగనున్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.